జెర్సీని ఎవరు రూపొందించారో బయటపెట్టేసిన క్రికెట్ స్కాట్లాండ్

ABN , First Publish Date - 2021-10-20T01:57:21+05:30 IST

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో స్కాట్లాండ్ అద్భుతంగా ఆడుతోంది

జెర్సీని ఎవరు రూపొందించారో బయటపెట్టేసిన క్రికెట్ స్కాట్లాండ్

యూఏఈ: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో స్కాట్లాండ్ అద్భుతంగా ఆడుతోంది. ఆడిన రెండు మ్యాచుల్లోనూ విజయం సాధించి గ్రూప్‌-బిలో నాలుగు పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఆ జట్టు ధరించిన జెర్సీకి సంబంధించి తాజాగా ఓ కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఆ జెర్సీని 12 ఏళ్ల రెబెకా డౌనీ రూపొందించింది.


ఈ విషయాన్ని తాజాగా క్రికెట్ స్కాట్లాండ్ వెల్లడించింది. హాడింగ్టన్‌కు చెందిన రెబెకా ఈ జెర్సీని డిజైన్ చేసిందని, ఆమెకు మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు క్రికెట్ స్కాట్లాండ్ వెల్లడించింది. ఆమె తమ తొలి మ్యాచ్‌ను టీవీలో చూసిందని పేర్కొంటూ టీం జెర్సీని ధరించి మ్యాచ్ జరుగుతుండగా టీవీ పక్కన ఉన్న చిన్నారి నిల్చున్న ఫొటోను ట్వీట్ చేసింది. ఊదా, నలుపు రంగు షేడ్స్‌తో ఉన్న ఈ జెర్సీకి ముందువైపు దశం పేరు ముద్రించి ఉంది. 


టీ20 ప్రపంచకప్ కప్ తొలి మ్యాచ్‌లోనే స్కాట్లాండ్ సంచలనం సృష్టించింది. బలమైన బంగ్లాదేశ్‌పై కైల్ కోయెట్జర్ సారథ్యంలోని స్కాట్లాండ్ ఆరు పరుగుల తేడాతో విజయం బంగ్లాదేశ్‌కు షాకిచ్చింది. ఒకానొక దశలో 53 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో సమయంలో క్రిస్ గ్రీవ్స్ చెలరేగాడు.


28 బంతుల్లో 4 ఫోర్లు, రెండు సిక్సర్లతో 45 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర  పోషించాడు. అంతేకాదు, బౌలింగులోనూ చెలరేగి కీలకమైన షకీబల్ హసన్, ముస్తాఫికర్ రహీం వికెట్లను పడగొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు. 

Updated Date - 2021-10-20T01:57:21+05:30 IST