సౌతాఫ్రికా క్రికెట్‌పై నిషేధం?

ABN , First Publish Date - 2020-10-15T09:45:16+05:30 IST

క్రికెట్‌ సౌతాఫ్రికా (సీఎస్‌ఏ)పై అంతర్జాతీయ బహిష్కరణ కత్తి వేలాడుతోంది. క్రికెట్‌ వ్యవహారాల్లో జోక్యం చేసుకోనున్నట్టు ఆ ...

సౌతాఫ్రికా క్రికెట్‌పై నిషేధం?

కేప్‌టౌన్‌: క్రికెట్‌ సౌతాఫ్రికా (సీఎస్‌ఏ)పై అంతర్జాతీయ బహిష్కరణ కత్తి వేలాడుతోంది.  క్రికెట్‌ వ్యవహారాల్లో జోక్యం చేసుకోనున్నట్టు ఆ దేశ ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. ఈ నేపథ్యంలో సీఎ్‌సఏపై అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) వేటు వేసే అవకాశాలు కన్పిస్తున్నాయి.  ఐసీసీ రాజ్యాంగం ప్రకారం సభ్య దేశాల క్రికెట్‌ వ్యవహారాల్లో ఆయా ప్రభుత్వాలు జోక్యం చేసుకోకూడదు. అలా జరిగితే ఆ క్రికెట్‌ బోర్డును ఐసీసీ అంతర్జాతీయ పోటీల నుంచి బహిష్కరిస్తుంది.  అవినీతి ఆరోపణలతో గత ఆగస్టులో సీఎ్‌సఏ సీఈవో తదితరులు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇక సీఎ్‌సఏలో అవినీతి జరిగినట్టు ప్రభుత్వం నియమించిన విచారణ కమిటీ నిర్ధారించింది. దాంతో సీఎ్‌సఏపై చర్యలు తీసుకొనేందుకు సౌతాఫ్రికా ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తోంది. మరోవైపు..సీఎ్‌సఏ డైరెక్టర్లంతా మూకుమ్మడిగా రాజీనామా చేయాలని సౌతాఫ్రికా క్రికెటర్ల సంఘం డిమాండ్‌ చేసింది.  

Updated Date - 2020-10-15T09:45:16+05:30 IST