Abn logo
Sep 26 2021 @ 23:49PM

అండర్‌ 25 క్రికెట్‌ జిల్లా జట్టు ఎంపిక

ఎంపికైన క్రికెట్‌ జిల్లా జట్టు

ఏలూరు స్పోర్ట్స్‌, సెప్టెంబరు 25: జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో బాలుర అండర్‌ 25 క్రికెట్‌ జట్టు ఎంపిక ఏలూరు ఆశ్రం కళాశాల మైదానంలో నిర్వహించినట్లు అసోసియేషన్‌ కార్యదర్శి గోకరాజు రామరాజు తెలిపారు. వి.ఉజ్వల్‌ (కెప్టెన్‌), ఎస్‌.జగదీష్‌ రామిరెడ్డి (వైస్‌ కెప్టెన్‌), వీవీఎస్‌ఎస్‌.శ్రీహర్ష, ఎంఎ.ప్రణీత్‌, స్వామినాయుడు, పి.వివేకన్‌, కేఏఎస్‌ఎన్‌.హరీష్‌, కె.ఈశ్వరరావు, ఎం.రూపేష్‌, జి.రు త్విక్‌, సీతారామరాజు, సాయి కార్తీక్‌, బాలాజీ, వి.రోహిత్‌, ఎ.దినేష్‌, స్టాండ్‌బై క్రీడా కారులుగా లలిత్‌ కృష్ణ, కె.అక్షయ్‌, కె.భరత్‌సాయి తేజ, ఎ.ప్రేమ్‌చంద్‌, కె.నవీన్‌కు మార్‌  ఎంపికయ్యారు. ఈనెల 28 నుంచి గుంటూరు జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని అసోసియేషన్‌ సహాయ కార్యదర్శి వగేష్‌ కుమార్‌ తెలిపారు.