Abn logo
Sep 18 2021 @ 00:42AM

‘క్రికెట్‌ ట్విట్టర్‌’

క్రికెట్‌ ప్రేమికులకు శుభవార్త. ‘క్రికెట్‌ ట్విట్టర్‌’ పేరిటి రాబోయే సీజన్‌లో ప్రపంచవ్యాప్తంగా ప్రచారానికి కస్టమ్‌ ఎమోజీతో ‘ట్విట్టర్‌’ సన్నద్ధమైంది.  ఎవరైనా ఈ హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీట్‌ చేసుకోవచ్చు.


తెలుగు సహా వివిధ భాషలను ఇది సపోర్ట్‌ చేస్తుంది.  ఇందుకోసం ట్విట్టర్‌ పూర్తి స్థాయిలో ఒక పేజీని ప్రత్యేకించనుంది. తద్వారా క్రికెట్‌ అప్‌డేట్స్‌ను అభిమానులు తెలుసుకోగలుగుతారు. ఫేవరేట్‌ టీమ్స్‌, ఆటగాళ్ళు, నిపుణుల ట్వీట్లను ఫాలో కావచ్చు. ట్విట్టర్‌ భాగస్వాముల వీడియోలను కూడా వీక్షించే వెసులుబాటు ఉంటుంది. ఈ ప్రచారంలో భాగంగా అభిమానులకు క్రికెట్‌ టాపిక్స్‌ తెలియజేయనుంది. మెషీన్‌ లెర్నింగ్‌ ఉపయోగించి ప్రత్యేక ట్వీట్‌లను సదరు అభిమానులకు టైమ్‌లైన్‌లో అందేలా చూస్తుంది. ట్వీట్‌ చేసే వ్యక్తులు సొంతంగా లేదంటే ట్విట్టర్‌ ప్రత్యేకించిన జాబితాలను పొందవచ్చు. క్రికెట్‌, ఇండియా క్రికెట్‌, ఐసీసీ ఉమన్స్‌ టీ20 వరల్డ్‌ కప్‌ ఢిల్లీ కేపిటల్‌ ఐపీఎల్‌ టీమ్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ టీమ్‌ వంటి జాబితాలను పొందవచ్చు. తమ అభిమాన మ్యాచ్‌లపై లైవ్‌ చాటింగ్‌కూ ఆస్కారం ఉంటుంది.