Abn logo
Nov 22 2020 @ 21:00PM

నీళ్లు పోసుకున్నావ్ కదా.. యూసుఫ్ పఠాన్‌ను ట్రోల్ చేసిన ఇర్ఫాన్

Kaakateeya

ఇంటర్నెట్ డెస్క్: క్రికెటర్లు ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్‌లు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తరచుగా తమ రోజువారీ లైఫ్‌స్టైల్ గురించి పోస్ట్‌లు పెడుతూ అభిమానులను అలరిస్తుంటారు. కొన్నిసార్లు అన్నదమ్ములిద్దరూ ఒకరిపై మరొకరు ఫన్నీ పోస్టులు కూడా చేస్తూ ఎంటర్‌టైన్ చేస్తుంటారు. ఈ రోజు కూడా యూసుఫ్ చేసిన ఓ ట్వీట్‌పై ఇర్ఫాన్ ఇచ్చిన రిప్లై ఫాన్స్‌కు తెగ నచ్చేసింది. ఈ పోస్ట్ ప్రస్తుంతం ట్విటర్‌లో వైరల్ అవుతోంది. 

ఈ రోజు ఉదయం జిమ్‌కు వెళ్లిన యూసుఫ్ పఠాన్ వర్కవుట్ తరువాత తడిచిన టీషర్ట్‌తో ఉన్న తన సెల్ఫీని ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. ‘ఆరోగ్యవంతమైన జీవితం గడిపేందుకు మిమ్మల్ని మీరు ప్రేమించండి.’ అంటూ ఆ పోస్టుకు కామెంట్ చేశాడు. ఈ పోస్టుపై యూసుఫ్ తమ్ముడు ఇర్ఫాన్ పఠాన్ చమత్కారమైన రిప్లై ఇచ్చాడు. ‘నిజం చెప్పు నువ్వు భారీగా వర్కవుట్ చేశావని చెప్పడానికి టీషర్ట్‌పై నీళ్లు పోసుకున్నావ్ కదా..? అంటూ ట్రోల్ చేశాడు. యూసుఫ్‌పై ఇర్ఫాన్ చేసిన ఈ కామెంట్ నెటిజన్లకు తెగ నచ్చేస్తోంది. ఇప్పటికే వేలమంది దీనికి లైక్‌లో కొడుతున్నారు. రీట్వీట్‌లు చేస్తున్నారు.


Advertisement
Advertisement