వారెవా...సిరాజ్‌

ABN , First Publish Date - 2021-01-19T06:13:58+05:30 IST

నన్ను ఈ స్థాయికి చేర్చేందుకు అహరహం శ్రమించిన నాన్న చనిపోవడంతో నాలో గూడుకట్టుకున్న దుఃఖంతో టెస్ట్‌ సిరీ్‌సలో ఆడగలనా అనే ఆందోళనలో పడిపోయా. కానీ అమ్మ మాటలతో ఆ గుబులు మాయమైంది...

వారెవా...సిరాజ్‌

నన్ను ఈ స్థాయికి చేర్చేందుకు అహరహం శ్రమించిన నాన్న చనిపోవడంతో నాలో గూడుకట్టుకున్న దుఃఖంతో టెస్ట్‌ సిరీ్‌సలో ఆడగలనా అనే ఆందోళనలో పడిపోయా. కానీ అమ్మ మాటలతో ఆ గుబులు మాయమైంది. ఆమె మాటలు నాలో ధైర్యం, ఆత్మవిశ్వాసం, మానసిక స్థయిర్యం నిం పాయి. దాంతో నాన్న కలను నిజం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నా.. 


నాలుగో టెస్ట్‌లో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన అనంతరం మహ్మద్‌ సిరాజ్‌ అత్యంత కఠినమైన, సవాలుతో కూడిన ఆస్ట్రేలియా పర్యటనలో హైదరాబాదీ బౌలర్‌ మహ్మద్‌  సిరాజ్‌ ఆడిన మూడు టెస్టుల్లో 13 వికెట్లతో అదరగొట్టాడు. ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన కొద్దిరోజులకే తండ్రి మరణించడంతో సిరాజ్‌ గుండె పగిలింది. తీవ్ర దుఃఖంలో కూరుకుపోయాడు. కానీ అమ్మతోపాటు జట్టు సహచరుల ఓదార్పుతో త్వరగానే  కోలుకున్నాడు. తనను టెస్ట్‌ల్లో చూడాలన్న తండ్రి కల నిజమయ్యే రోజు సిరాజ్‌కు వచ్చేసింది. 


ప్రధాన పేసర్‌ షమి గాయపడడంతో  మెల్‌బోర్న్‌లో జరిగిన రెండో టెస్ట్‌లో సిరాజ్‌కు స్థానం దక్కింది. అప్పుడు భారత జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. కానీ సిరాజ్‌తోపాటు టీమిండియా కూడా ఆ టెస్ట్‌ను సవాలుగా తీసుకున్నాయి. తన అరంగేట్ర టెస్ట్‌లో బౌన్సర్లతో ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ను సిరాజ్‌ వణికించాడు. మొత్తం ఐదు వికెట్లు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అలా నాన్న కలను నెరవేర్చే క్రమంలో ఘనమైన అడుగు వేశాడు. ఇక సిడ్నీలో ఆడిన తన రెండో టెస్ట్‌లో బుమ్రాతో కలిసి కొత్త బంతితో బౌలింగ్‌ చేసే గౌరవం సిరాజ్‌కు లభించింది. అయితే ఆ మ్యాచ్‌లో రెండే వికెట్లతో సరిపెట్టుకున్నాడు. భారత పేసర్లు, స్పిన్నర్లు వరుసపెట్టి గాయాలపాలైన వేళ..బ్రిస్బేన్‌ టెస్ట్‌లో మొత్తం బౌలింగ్‌ విభాగం భారాన్ని మోసే అరుదైన అవకాశం సిరాజ్‌కు దక్కింది.  అంతేకాదు.. బ్రిస్బేన్‌టెస్ట్‌లోని రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా ఐదు వికెట్లతో సత్తా చాటాడు.

(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)

Updated Date - 2021-01-19T06:13:58+05:30 IST