Abn logo
May 5 2021 @ 00:00AM

మనసుంటే మార్గం ఉంటుంది!

ఇది ఐపీఎల్‌ సీజన్‌. అయితే కరోనాతో క్రికెటర్లంతా బయో బబూల్‌కే పరిమితమవ్వాల్సిన పరిస్థితి. ఆటగాళ్ల జీవిత భాగస్వాములను స్టేడియంలోకి అనుమతిస్తున్నా... భౌతిక దూరం తప్పనిసరయింది! దీంతో తమ ఇష్ట సఖులకు ప్రేమను వినూత్న పద్ధతుల్లో తెలుపుతున్నారు క్రికెటర్లు. అలాంటిదే ఈ చిత్రం. ‘ముంబయి ఇండియన్స్‌’ బ్యాట్స్‌మన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ మ్యాచ్‌ అనంతరం తన భార్య దేవిషా శెట్టికి ఇలా అద్దంలో నుంచి ముద్దు ఇచ్చాడు. ముచ్చటైన ఈ చిత్రం చూసిన నెటిజనులు ‘మనసుంటే మార్గం ఉంటుంది’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు.