యాప్‌లో ప్లే.. ఆనలైనలో క్యాష్‌!

ABN , First Publish Date - 2021-10-24T04:31:10+05:30 IST

ఐపీఎల్‌ ముగిసి రోజులు గడవక ముందే టీ-20 వరల్డ్‌కప్‌ శనివారం ప్రారంభమైంది.

యాప్‌లో ప్లే..  ఆనలైనలో క్యాష్‌!

టీ-20 లో నేడు పాకిస్థానతో భారత ఢీ

జోరందుకోనున్న క్రికెట్‌ బెట్టింగ్‌ 

యువతే టార్గెట్‌గా రెచ్చిపోతున్న మాఫియా

ప్రత్యేక యాప్‌లలో నిర్వహణ

ఆర్థిక లావాదేవీలన్నీ ఆనలైనలోనే!


ప్రతి ఓవరు.. ప్రతి బంతి ఉత్కంఠ రేపే టీ-20 మ్యాచ అంటే క్రీడాభామానులకు పండగే. అందులోనూ దాయాది పాకిస్థాన జట్టుతో తలపడటం అంటే ఆ ఉత్సాహం.. ఉత్కంఠ అంతా ఇంతా ఉండదు. ప్రస్తుతం జరుగుతున్న టీ-20 ప్రపంచ కప్‌ టోర్నీలో ఆదివారం భారత-పాకిస్థాన జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచపై క్రీడాభిమానుల ఎదురుచూపు కంటే బెట్టింగ్‌ రాయుళ్లు, బెట్టింగ్‌ మాఫియాల హడావిడే ఎక్కువగా ఉంటోంది. మ్యాచలో ఉత్కంఠ రేపే ప్రతి బాల్‌కూ పందెం కాసేందుకు నిర్వాహకులు ల్యాప్‌టా్‌పలు, సెల్‌ఫోన్లు సిద్ధం చేసుకుంటున్నారు.  ప్రత్యేక యాప్‌ల ద్వారా ఆనలైనలో ఆర్థిక లావాదేవీలు నడుపుతూ ఎంతోమంది జీవితాలతో ఆడుకుంటున్నారు.


నెల్లూరు(క్రైం), అక్టోబరు 23 : ఐపీఎల్‌ ముగిసి రోజులు గడవక ముందే టీ-20 వరల్డ్‌కప్‌ శనివారం ప్రారంభమైంది. గతవారం జరిగిన ఈ టోర్నీలో బెట్టింగ్‌ రాయుళ్లు భారీగానే లావాదేవీలు జరిపారు. జీవితాలే మ్యాచలు అన్నట్లుగా పలువురు  రూ.వేలు, లక్షల రూపాయలు బెట్టింగ్‌ కాస్తూ జీవితాలనే పోగొట్టుకున్నారు. బాల్‌ బాల్‌కు బెట్టింగ్‌ అన్నట్లుగా బెట్టింగ్‌ నిర్వాహకులు సెల్‌ఫోన్లు, ప్రత్యేక యాప్‌ల ద్వారా  తమ వ్యవహారాలు నడిపారు. ఈ వ్యసనానికి బానిస అవుతున్న ఎంతోమంది కష్టపడిన సొమ్ముతోపాటు ఇంట్లో ఉన్న సొమ్మును, చివరకు బంగారు ఆభరణాలను కుదవపెట్టి మరీ  బెట్టింగ్‌ కాస్తూ నష్టపోతున్నారు. 


ఎక్కడికక్కడ యాప్‌లు


ప్రస్తుతం బెట్టింగ్‌ కొత్త రంగు పులుముకుంది. గతంలోలా ఓ ప్రాంతంలో ఉండి నగదును నేరుగా ఒక్కరితో ఒక్కరు ఎదురుగా పెట్టుకొని బెట్టింగ్‌ కాసే పరిస్థితులు ఇప్పుడు లేవు. జూదగాళ్లు హోటళ్లలోని గదులను అద్దెకు తీసుకొని ఈ మ్యాచకు ఇంత, ఫలానా ఓవర్‌లో అన్ని పరుగులు, బాల్‌కు వికెట్‌ అంటూ డబ్బులు చేతులు మార్చుకునే రోజులు పోయాయి. అలాగని అవి జరగడం లేదని చెప్పడం లేదు. కొందరు జూదగాళ్లు ఇప్పటకీ పాత పద్ధతినే అవలంభిస్తుండగా, కొత్త టెక్నాలజీపై అవగాహన ఉన్న వారు మాత్రం యాప్‌లను అందుబాటులోకి తెస్తున్నారు. బెట్టింగ్‌ నిర్వహించే వారు యాప్‌ల వివరాలు తెలిపి ముందుగా అడ్వాన్సగా రూ.5 నుంచి లక్ష వరకు వేయాలని సూచిస్తారు. ఆ నగదును ఫోనపే, గూగుల్‌పే ద్వారా పంపాలని నెంబర్లు ఇస్తారు. నగదు జమ అయ్యాకే బెట్టింగ్‌ కాసుకునే అవకాశం కల్పిస్తారు. బెట్టింగ్‌  యాప్‌లు నిర్వహించేది ఎవరు!?. ఆనలైన ద్వారా పంపే నగదు ఎవరికి జమ అవుతోంది అనే వివరాలు అసలు తెలియవు. ఫోన ద్వారా డబ్బులు పంపాక బెట్టింగ్‌లో గెలిస్తే డబ్బు పంపడం.. ఓడిపోతే డబ్బు తీసుకోవడం చకచకా జరిగిపోతోంది. 


హెచ్చరికలు ఏవీ!?


ఈ స్థాయిలో ఆనలైనలో బెట్టింగ్‌ జోరుగా సాగుతున్నా పోలీసులలో మాత్రం చలనం ఉండటం లేదు. కనీసం హెచ్చరికలూ జారీ చేయకపోవడంతో  బెట్టింగ్‌ రాయుళ్లు, నిర్వాహకులు పేట్రేగిపోతున్నారు. 


Updated Date - 2021-10-24T04:31:10+05:30 IST