వివాహిత ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-12-05T05:45:33+05:30 IST

మానసికస్థితి సరిగ్గాలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం పట్టణంలో చోటుచేసుకుంది.

వివాహిత ఆత్మహత్య

పొన్నూరు, డిసెంబరు 4:  మానసికస్థితి సరిగ్గాలేక  వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం పట్టణంలో చోటుచేసుకుంది.  25 వార్డు యానాది కాలనీకి చెందిన పులి పోలేశ్వరమ్మ(26) కొంత కాలంగా మానసిక అనారోగ్యంతో బాధపడుతోందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలో శుక్రవారం  సాయంత్రం ఇంటి పైకప్పు రాడ్డుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు భర్త, కుమారుడు, కుమార్తె ఉన్నారు. పోలీసుల కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-12-05T05:45:33+05:30 IST