యూట్యూబ్‌ చానల్‌ విలేకరి అరెస్ట్‌

ABN , First Publish Date - 2021-01-21T07:00:29+05:30 IST

యూట్యూబ్‌ విలేకరిని అంటూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల వద్ద డబ్బు వసూలు చేస్తున్న ఓ విలేకరిని బాలాపూర్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి

యూట్యూబ్‌ చానల్‌ విలేకరి అరెస్ట్‌

పహాడిషరీఫ్‌, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): యూట్యూబ్‌ విలేకరిని అంటూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల వద్ద డబ్బు వసూలు చేస్తున్న ఓ విలేకరిని బాలాపూర్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. బాలాపూర్‌ ఇన్‌స్పెక్టర్‌ భాస్కర్‌ తెలిపిన వివరాల ప్రకారం ఎర్రగుంటకు చెందిన సాలం యాఫై (32) యూట్యూబ్‌ చానల్‌ నిర్వహిస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన అలీబిన్‌ ఖలీఫా, మహ్మద్‌ బిన్‌ సులేమాన్‌ అనే వ్యక్తులు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తుంటారు. ఓ ప్లాట్‌ విషయంలో ఆర్థిక లావాదేవీల్లో తేడా రావడంతో ఆ విషయం తెలుసుకున్న సాలం యాఫై ఇద్దరు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులను మీరు భూకబ్జాదారులు, మా వద్ద దానికి సంబంధించిన వీడియోలు ఉన్నాయి వాటిని బయటపెడుతానంటూ భయపెట్టాడు.  ఒకరి వద్ద 85వేలు, ఇంకొకరి వద్ద 65వేల రూపాయలను వసూలు చేశాడు. ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి సోదరి వివాహం సందర్భంగా మళ్లీ డబ్బు ఇవ్వాలని లేకపోతే వీడియోను బహిర్గతం చేస్తానని బెదిరించడంతో అలీబిన్‌ ఖలీఫా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాలం యాఫైను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. 


Updated Date - 2021-01-21T07:00:29+05:30 IST