Abn logo
Jan 26 2021 @ 00:22AM

బంగారం చోరీచేసిన దొంగ అరెస్టు

చేబ్రోలు, జనవరి25: చేబ్రోలు ప్రాంతంలో ఇటీవల వృద్ధురాలి నుంచి బంగారం చోరీ చేసిన దొంగను అరెస్టు చేసినట్లు గుంటూరు సౌత్‌ డీఎస్పీ జెస్సీ ప్రశాంతి తెలిపారు. సోమవారం చేబ్రోలు పోలీస్‌స్టేషన్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ జనవరి 19న నారాకోడూరు గ్రామంలో ఓ వృద్ధురాలికిగుంటూరు పట్టణానికి చెందిన పెండ్రా ముత్తయ్య అనే పాతనేరస్తుడు మాయమాటలు చెప్పి నిర్జన ప్రదేశానికి తీసుకు వెళ్లి బంగారు గొలుసు, చెవి దిద్దులను దొంగతనం చేశాడని తెలిపారు. గతంలో అతనిపై కేసులు ఉన్నాయని పేర్కొన్నారు.  నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచిన్నట్లు డీఎస్పీ వెల్లడించారు. ఈ సమావేశంలో చేబ్రోలు సీఐ మఽధుసూదనరావు, ఎస్‌ఐలు సీహెచ్‌ కిషోర్‌, ఎం.రాజకుమార్‌, ఎన్‌.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement