Abn logo
Nov 23 2020 @ 00:57AM

నేర సమాచారం

Kaakateeya

గుర్తుతెలియని శవం లభ్యం 

ధర్మవరంరూరల్‌, నవంబరు22: మండలపరిధిలోని పోతుకుంట బీసీకాలనీ వెనుకవైపు ఉన్న వంకగుంతలో తేలాడుతూ ఆదివారం సాయంత్రం ఓ గుర్తుతెలియని శవం లభ్యమైంది. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రూరల్‌ సీఐ చిన్నపెద్దయ్య, ఎస్‌ఐ జనార్ధన్‌నాయుడులు సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని చీకట్లోనే నీళ్లలో తేలాడుతున్న శవాన్ని వెలికి తీయించారు. ఈ సందర్బంగా సీఐ మాట్లాడుతూ స్థానికులు ఇచ్చిన సమాచారంతో వంకగుంతలో ఉన్న శవాన్ని వెలికితీయగా ఎలాంటి ఆనవాలు దొరకలేదన్నారు. సూమారు 30నుంచి 40వయస్సులోపు మృతిచెందిన వ్యక్తి వయస్సు ఉండవచ్చునని, ఆకుపచ్చ, లేత ఎరుపు గీతలు గల చెక్స్‌ షర్టు ఉందన్నారు. అలాగే కుడిచేతికి ఎరుపు దారం, మెడలో తాయెత్తు వుందన్నారు. అదేవిధంగా నీలిరంగు జీన్స్‌ప్యాంట్‌ వేసుకున్నాడన్నారు. ఆ పరిసర ప్రాంతాల్లో కూడా మద్యం తాగిన గ్లాసులు, కవర్లు గుర్తించామన్నారు. మద్యంతాగి ప్రమాదవశాత్తు మరణించాడా, లేక ఎవరైనా హత్య చేసి నీళ్లల్లో పడేశారన్న కోణంలో దర్యాప్తు చేపడుతున్నట్లు సీఐ తెలిపారు. శవాన్ని ప్రభుత్వాసుపత్రిలో ఉంచామన్నారు. ఆచూకీ తెలిసిన వారు 9440796832, 9440796834 నెంబర్లలో సంప్రదించాలన్నారు.


================================================


చంద్రప్ప మృతదేహం

ఆటో బోల్తా: భవన నిర్మాణ కార్మికుడి మృతి 

మరో నలుగురికి గాయాలు 

ధర్మవరంరూరల్‌, నవంబరు22: మం డలంలోని దర్శినమల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో  ఆటో బోల్తాపడి ఓ భవనకార్మికుడు మృతిచెందగా, మరో నలుగురికి గాయాలపాలైన సంఘటన ఆదివారం చో టుచేసుకుంది. పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాల మేరకు చిన్నూరు గ్రామానికి చెందిన బొగ్గు చంద్రప్ప, రుక్మిణి, గంగాధర్‌, అశోక్‌లు బేల్దారి పనికి ఆటోలో నేలకోట గ్రామానికి వెళుతున్నారు. దర్శినమల గ్రామ సమీపంలో ఎదురుగా ఓ ద్విచక్రవాహనం అడ్డురావడంతో తప్పించబోయి ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో భవన నిర్మాణ కార్మికుడు బొగ్గు చంద్రప్ప (60) అక్కడికక్కడే మృతిచెందగా, రుక్మిణి, గంగాధర్‌, అశోక్‌తో పాటు ఆటోడ్రైవర్‌ శ్రీనివాసులకు గాయాలయ్యాయి. ఆసుపత్రిలో మృతిచెందిన చంద్రప్ప కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. వెంటనే క్షతగాత్రులను 108 సాయంతో ధర్మవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 


==================================================


శివలింగ (ఫైల్‌)

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య 

బొమ్మనహాళ్‌, నవంబరు 22: మండలంలోని గోవింద వాడ గ్రామానికి చెందిన  రైతు కురుబ శివలింగ (45) ఆదివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇతడు తనకున్న ఆరెకరాల పొలంలో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిం చేవాడు. కొన్నే ళ్లుగా పంట దిగుబడి రాక, పెట్టిన పె ట్టుబడులు కూడా దక్క లేదు. పిల్లల చదువుల కోసం చేసిన ఖర్చులతో అప్పుల ఊబిలో కూరుకుపో యాడు. బయటి వ్యక్తుల తోపాటు బ్యాంకులో రుణాలు, బంగా రు నగలు తాకట్టు పెట్టి, రూ.15 లక్షల వరకు అ ప్పులు చేశారు. వాటిని తీర్చే మార్గం కానరాక, జీవితంపై విరక్తి చెంది ఆది వారం తెల్లవారుజామున ఇంట్లో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే బళ్లారి విమ్స్‌ ఆస్పత్రికి తర లించారు. అక్కడ చికిత్స పొందుతూ మధ్యాహ్నం మృతి చెందినట్లు తెలిపారు. శివలింగకు భార్య జయమ్మ, కుమార్తె, కుమారుడు, ఉన్నారు. అతడి భార్య ఫిర్యాదు మే రకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రమణారెడ్డి తెలిపారు. మృతుడి భార్య కురుబ జయమ్మ వైసీపీ తరపున గోవిందవాడ-1 ఎంపీటీసీ అభ్యర్థిగా బరిలో ఉన్నట్లు గ్రామస్థులు తెలిపారు.


Advertisement
Advertisement