నేర సమాచారం

ABN , First Publish Date - 2020-11-28T06:24:44+05:30 IST

ఇష్టారాజ్యంగా ఇంటి పన్నుల విధింపుపై మండలంలోని హావళిగి గ్రామస్థులు తిరగబడ్డారు. శుక్రవారం స్థానిక గ్రామ సచివాలయం వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు.

నేర సమాచారం

విద్యుదాఘాతంతో కార్మికుడి మృతి

డీ హీరేహాళ్‌, నవంబరు 27 : మండలంలోని ఓబుళాపురంలో శుక్రవారం కార్మికుడు నాగరాజు (30) విద్యు దాఘాతంతో మృతి చెందాడు. ఎస్‌ఐ వలీబాషా తెలిపిన వివరాలివి. గుంటూరు జిల్లా తాడికొండకు చెందిన నా గరాజు స్థానికంగా ఫ్యాక్టరీల్లో కార్మికుడిగా పనిచేస్తూ జీ వనం సాగించేవాడు. ప్రమాదవశాత్తు జరిగిన విద్యుత్‌ ప్రమాదంలో మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.


దౌర్జన్యానికి దిగిన గ్రామ వలంటీర్‌

విడపనకల్లు, నవంబరు 27: ఇష్టారాజ్యంగా ఇంటి పన్నుల విధింపుపై మండలంలోని హావళిగి గ్రామస్థులు తిరగబడ్డారు. శుక్రవారం స్థానిక గ్రామ సచివాలయం వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. పేదలకు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు అధికంగా ఇంటి పన్నులు వేయడం ఇదెక్కడి న్యా యమంటూ నిలదీశారు. గ్రామ కార్యదర్శి శివకేశరెడ్డితో వాగ్వాదానికి దిగారు. పూరి గుడిసెకు రూ.2,113 పన్ను విధించిన అధికారులు అదే ఆర్‌సీసీ మిద్దెకు కేవలం రూ.75 ఇంటి పన్ను వేస్తారా అని ప్రశ్నించారు. గ్రామ కార్యదర్శి మా ట్లాడుతూ ఎవరికైనా పొరపాటున అధికంగా ఇంటి పన్ను వేసి ఉంటే పరిశీలించి న్యాయం చేస్తామన్నారు. అంతలోనే అక్కడే ఉన్న గ్రామ వలంటీరు మల్లికార్జున కలగజేసుకున్నాడు. ఇంటి పన్నులు ఎక్కువ వేశారని అడగటాని కి మీరెవరంటూ గ్రామస్థులపై దౌర్జన్యానికి దిగాడు. దీంతో గ్రామస్థులు ఆ గ్రహంతో ఊగిపోయారు. వలంటీర్‌ దౌర్జన్యం చేస్తున్నా పంచాయతీ కార్యదర్శి పెదవి విప్పకపోవడంపై నిలదీశారు. వీఆర్వో, కార్యదర్శి గ్రామ ప్రజలకు సర్దిచెప్పి పంపారు. అయితే గ్రామస్థులు దౌర్జన్యం చేసినట్లు వలంటీర్‌ పాల్తూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశాడు. గ్రామస్థులు కూడా పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని తమపై దౌర్జన్యం చేసినట్లు వలంటీర్‌పై ఫిర్యాదు చేశారు. ఇరువర్గాల వారిని స్టేషన్‌కు పిలిపించి పంచాయితీ చేసినా వివాదం సద్దుమణగలేదు.


=====================================================



బాలుడి ఆత్మహత్య 

కుందుర్పి, నవంబరు 27: మండలంలోని ఎం వెం కటంపల్లికి చెందిన బాలుడు నవీన్‌ (15) శుక్రవారం ఉ రేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలివి. రంగల క్ష్మీ, నాగభూషణ దంపతులకు ఇద్దరు కుమారులు. భా ర్య, పెద్ద కుమారుడు బెంగళూరుకు వలస వెళ్లారు. చి న్న కుమారుడు నవీన్‌ చదువు నిమిత్తం తండ్రి వద్దే వి డిచి వెళ్లారు. కుందుర్పి ఉన్నత పాఠశాలలో తొమ్మిదో త రగతి చదువుతున్నాడు. తల్లి దూరంగా ఉన్న కారణం గా నవీన్‌ మనస్తాపం చెంది ఇంట్లో ఎవరూలేని సమయంలో దూలానికి ఉ రేసుకున్నాడు. పోలీసులు మృతదేహాన్ని కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. 


====================================================



రైల్లో నుంచి పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి

ధర్మవరంఅర్బన్‌, నవంబరు27: రైల్లో నుంచి జారిపడి  ఓ గుర్తుతెలియని వ్యక్తి (50)మృతిచెందిన సంఘటన శుక్రవారం పట్టణంలోని గాంధీనగర్‌ సమీపంలో చోటుచేసుకుంది. పట్టణంలోని గాంధీనగర్‌ రైల్వేగేటు ట్రాక్‌ పక్కన గుర్తుతెలియని వ్యక్తి  శవమై పడి ఉన్నాడు. ఉదయం రైల్వేకీమెన్‌ సమాచారం మేరకు రైల్వే ఎస్‌ఐ నాగప్ప సంఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించారు. అయితే మృతుడి వద్ద ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు 6305073235 నెంబర్‌కు ఫోన్‌ చేయాలని రైల్వే ఎస్‌ఐ కోరారు.


Updated Date - 2020-11-28T06:24:44+05:30 IST