Jul 30 2021 @ 06:01AM

క్రైమ్‌ థ్రిల్లర్‌

ఆది సాయికుమార్‌, పాయల్‌ రాజ్‌పుత్‌ జంటగా రూపుదిద్దుకొనే  క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘కిరాతక’ రెగ్యులర్‌ షూటింగ్‌ ఆగస్టు 13 నుంచి ప్రారంభం కానుంది. హీరోయిన్‌ పూర్ణ ఓ పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తున్న ఈ డిఫరెంట్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌లో దాసరి అరుణ్‌కుమార్‌, దేవ్‌ గిల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. చిత్ర నిర్మాత డాక్టర్‌ నాగం తిరుపతిరెడ్డి ఈ చిత్ర విశేషాలు వెల్లడిస్తూ ‘మేకింగ్‌ పరంగా ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో చిత్రాన్ని నిర్మిస్తున్నాం. తప్పకుండా కమర్షియల్‌గా హిట్‌ అవుతుందనే నమ్మకం ఉంది’ అని తెలిపారు.‘ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ పూర్తయింది. పక్కా ప్లానింగ్‌తో షూటింగ్‌కు వెళుతున్నాం. ఆది సాయికుమార్‌, పాయల్‌ రాజ్‌పుత్‌ మధ్య ఉండే కెమిస్త్రీ ప్రేక్షకులను అలరిస్తుంది’ అని తెలిపారు.