ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే.. క్రిమినల్‌ కేసులు

ABN , First Publish Date - 2021-06-15T06:30:13+05:30 IST

ప్రభుత్వభూములు, స్థలా ల్లో ఆక్రమణలకు పాల్పడితే ఎంతటి వారిపైనైన క్రి మినల్‌ కేసులు తప్పవని తహసీల్దార్‌ ఏవి.హనుమంతరావు హెచ్చరించారు.

ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే..  క్రిమినల్‌ కేసులు


తహసీల్దార్‌ హనుమంతరావు 

పొదిలి, జూన్‌ 14 : ప్రభుత్వభూములు, స్థలా ల్లో ఆక్రమణలకు పాల్పడితే ఎంతటి వారిపైనైన  క్రి మినల్‌ కేసులు  తప్పవని తహసీల్దార్‌ ఏవి.హనుమంతరావు హెచ్చరించారు. దర్జాగా భూ కబ్జా శీర్షికన సోమవారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనా నికి తహసీల్దార్‌ స్పందించారు. పొదిలి నగరపంచాయతీ పరిధిలోని మార్కాపురం అడ్డరోడ్డులో 82-5లో 23 సెంట్లు ప్రభుత్వ స్థలంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆర్‌ఐ, వీఆర్వోలను ఆయన ఆదేశించారు. జిల్లా అధికారులు సైతం భూ కబ్జాపై స్థానిక రెవెన్యూ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి నట్లు తెలిపారు. ఆక్రమణలు తొలగించడంతో పాటు తిరిగి పునరావృతం కాకుండా చూడాలని అధికారులను కోరినట్లు తెలిసింది. పట్టణంలో ఒకవైపు రెవెన్యూ బృందాలు భూ ఆక్రమణలపై సర్వే నిర్వహిస్తుండగా మరో వైపు ఆక్రమణలు జరగడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకొని నిర్మాణాలు చేపడితే కూల్చివేసేందుకు కూడా వెనుకాడబోమని తహసీల్దార్‌ హనుమంతరావు తేల్చి చెప్పారు. 


Updated Date - 2021-06-15T06:30:13+05:30 IST