బిహార్‌లో క్రిమినల్స్‌ జోరు

ABN , First Publish Date - 2020-10-21T08:22:23+05:30 IST

బిహార్‌ తొలిదశ ఎన్నికల్లో తలపడుతున్న వివిధ పార్టీలకు చెందిన 1,064 మంది అభ్యర్థుల్లో 328(31ు) మంది క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్నారు.

బిహార్‌లో క్రిమినల్స్‌ జోరు

328 మంది అభ్యర్థులపై క్రిమినల్‌ కేసులు

నాన్‌బెయిలబుల్‌ కేసుల్లో 56 మంది.. 21 మందిపై మర్డర్‌ కేసులు

లాలూ పార్టీ ఆర్జేడీ వారే అధికం.. వెల్లడించిన ఏడీఆర్‌ నివేదిక 


న్యూఢిల్లీ, అక్టోబరు 20: బిహార్‌ తొలిదశ ఎన్నికల్లో తలపడుతున్న వివిధ పార్టీలకు చెందిన 1,064 మంది అభ్యర్థుల్లో 328(31ు) మంది క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్నారు. వీరిలో 56 మందిపై ఐదేళ్లకు పైగా జైలు శిక్ష పడే అవకాశమున్న నాన్‌బెయిలబుల్‌ కేసులు కూడా ఉన్నాయి. కేసులు ఎదుర్కొంటున్న అభ్యర్థుల్లో మాజీ సీఎం లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు చెందిన ఆర్జేడీ నేతలే అధికంగా ఉన్నారు.  ఈ మేరకు అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌(ఏడీఆర్‌) ఓ నివేదికను విడుదల చేసింది. మొత్తం అభ్యర్థుల్లో 29 మందిపై మహిళా వేధింపుల కేసులు, వీరిలో ముగ్గురుపై అత్యాచార కేసులు ఉన్నాయి. 21 మందిపై హత్యానేరం(302 సెక్షన్‌) కేసులు, 62 మందిపై హత్యాయత్నం(307 సెక్షన్‌) కేసులు ఉన్నట్టు నివేదిక వెల్లడించింది. నేరస్తులకు టికెట్లు ఇవ్వరాదన్న సుప్రీం కోర్టు సూచనలను ఏ పార్టీ పట్టించుకోలేదు. అభ్యర్థుల ఎంపికలో పార్టీలు అవలంభించిన తీరును బట్టి ఎన్నికల్లో సంస్కరణలకు ఏ పార్టీ సిద్ధంగా లేదని నివేదిక వివరించింది. ఈ నెల 28న బిహార్‌లో 71 అసెంబ్లీ స్థానాలకు తొలిదశ పోలింగ్‌ జరగనుంది. 

Updated Date - 2020-10-21T08:22:23+05:30 IST