క్రైస్తవులపై అనుచిత వ్యాఖ్యలు తగవు

ABN , First Publish Date - 2021-01-21T05:25:59+05:30 IST

క్రైస్తవ్యంపై టీడీపీ, బీజేపీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేస్తే వారికి తగిన బుద్ధిచెబుతామని పాస్టర్లు, క్రైస్తవసంఘాల నాయకులు హెచ్చరించారు.

క్రైస్తవులపై అనుచిత వ్యాఖ్యలు తగవు
ఐక్యత చాటుతున్న క్రైస్తవసంఘాల నాయకులు

అత్మ గౌరవసభలో క్రైస్తవ సంఘాల నాయకులు

గుంటూరు(తూర్పు), జనవరి20: క్రైస్తవ్యంపై టీడీపీ, బీజేపీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేస్తే వారికి  తగిన బుద్ధిచెబుతామని పాస్టర్లు, క్రైస్తవసంఘాల నాయకులు హెచ్చరించారు. బుధవారం వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఏపీ బిషప్స్‌ కౌన్సిల్‌ అండ్‌ ఫాస్టర్స్‌ ఫెలోషిప్‌ లీడర్స్‌ ఫోరం ఆధ్వర్యంలో క్రైస్తవుల అత్యగౌరవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇండియన్‌ రివైవల్‌ ఇవాంజికల్‌ ఫెలోషిప్‌ అధ్యక్షుడు బిషప్‌ రెబ్బా ఇమ్మాన్యూయేల్‌ మాట్లాడుతూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను ఉద్దేశించి చంద్రబాబు క్రైస్తవులపై చేసిన వ్యాఖ్యలు వెనక్కితీసుకోవాలని డిమాండ్‌ చేశారు. క్రీస్తు సువార్తలు ప్రచారం చేసుకోవడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని దీనిని రాజకీయం ఎందుకు చేస్తున్నారో అర్థంకావడం లేదన్నారు. ఎక్కడైనా మతమార్పిడిలు చేస్తున్నట్టు టీడీపీ, బీజేపీ నాయకులు నిరూపించాలని డిమాండ్‌ చేశారు. ఆంగ్లో ఇండియన్‌ మాజీ ఎమ్మెల్యే ఫిలిఫ్స్‌ సి థోచర్‌ మాట్లాడుతూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తనను బాధించాయని, అందుకే టీడీపీకి రాజీనామా చేశానని తెలిపారు. కార్యక్రమంలో పాస్టర్‌ ఫెలోషిప్‌ జిల్లా అధ్యక్షుడు పి.బాలశౌరి, పాస్టర్లు రవిప్రకాష్‌, పృధ్వీరాజు, ఏలియా, క్రైస్తవ సంఘాల నాయకులు మద్దు ప్రేమ్‌జ్యోతిబాబు, జి.రాజసుందరంబాబు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-21T05:25:59+05:30 IST