Abn logo
Sep 26 2021 @ 08:53AM

ఇంట్లోకి చొరబడిన మొసలి

                  - పెరుంగళత్తూర్‌లో కలకలం


ప్యారీస్‌(చెన్నై): స్థానిక తాంబరం సమీపంలోని పెరుంగళత్తూర్‌ ప్రాంతంలో ఉన్న ఓ ఇంట్లోకి మొసలి చొరబడిన సంఘటన శనివారం కలకలం రేపింది. పెరుంగళత్తూర్‌ ప్రాంతంలో ఉన్న చెరువులో సంచరిస్తున్న మొసళ్లు రాత్రి వేళల్లో చెరువు నుంచి బయటకు వచ్చి ఇళ్ల ముంగిట్లో ఉన్న కోళ్లు, బాతులు, కుక్కలను వేటాడుతున్నట్టు స్థానికులు అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. జనసంచారంలోకి వచ్చే మొసళ్లను బంధించాల్సిందిగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో, శనివారం ఉదయం చెరువు సమీపంలో నివసిస్తున్న విజయకుమార్‌ ఇంటి ముందు పిల్లలు ఆడుకుంటున్న సమయంలో ఒకటిన్నర అడుగుల పొడవున్న మొసలి ఇంట్లోకి చొరబడడం చూసిన చిన్నారులు భయంతో కేకలు వేశారు. చుట్టుపక్కల వారు మొసలిని గోనె సంచెలో బంధించి వండలూరు జూ పార్క్‌ అధికారులకు అప్పగించారు.