వడోదర నివాస ప్రాంతాల్లో మొసలి ప్రత్యక్షం

ABN , First Publish Date - 2021-07-16T14:18:37+05:30 IST

నదిలోని ఓ మొసలి నివాసప్రాంతంలోకి ప్రత్యక్షమైన ఘటన గుజరాత్ రాష్ట్రంలోని వడోదర నగరంలో వెలుగుచూసింది....

వడోదర నివాస ప్రాంతాల్లో మొసలి ప్రత్యక్షం

వడోదర(గుజరాత్): నదిలోని ఓ మొసలి నివాసప్రాంతంలోకి ప్రత్యక్షమైన ఘటన గుజరాత్ రాష్ట్రంలోని వడోదర నగరంలో వెలుగుచూసింది. ఓ పెద్ద మొసలి వడోదర నగరంలోని సలట్ వాడ నివాస ప్రాంతంలో కనిపించింది. మొసలిని చూసిన ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు. వైల్డ్ లైఫ్ ట్రస్టు సభ్యులు చూసి మొసలిని పట్టుకొని అటవీశాఖ అధికారులకు అప్పగించారు. వర్షాకాలంలో వరదనీటి ప్రవాహంతో మొసలి నది నుంచి కొట్టుకువచ్చి ఉంటుందని స్థానికులు చెప్పారు. మొసలిని చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.


Updated Date - 2021-07-16T14:18:37+05:30 IST