Abn logo
Sep 27 2021 @ 00:19AM

వాడుతున్న వేరుశనగ

వాడుముఖం పట్టిన వేరుశనగ పంట


నేలరాలని చినుకు... అయోమయంలో రైతులు 

ధర్మవరంరూరల్‌, సెప్టెంబరు 26 : వరుణుడు కరుణించకపోవడంతో వేరుశనగ పంట వాడుతోంది. ఇది పంట దిగుబడిపై ప్రభావం చూపుతోంది. మరో వారంలో వర్షం రాకుంటే పిందెలు కూడా ఏర్పాడని పరిస్థితి నెలకొంటుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లక్షలు పెట్టుబడులు పెట్టి పంట సాగుచేశారు. తొలిదశలో కురిసిన వర్షం.. తీరా పంట దిగుబడి సమయంలో రాకపోవడంతో  రైతులు దిగాలు చెందుతున్నారు. 20 రోజుల నుంచి వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. గతేడాది అధిక వర్షాలతో, ఈ ఏడాది వర్షాభావంతో పంట నష్టపోతున్నామని వాపోతున్నారు.  


వర్షం రాకపోతే నష్టమే : ఆదినారాయణరెడ్డి, బడన్నపల్లి, రైతు

 20 రోజులకు పైగా అదునుగా వర్షం కురకపోవడంతో వేరుశనగ పంట వాడుపట్టింది. పది రోజుల్లో వర్షం వస్తే తప్ప బయటపడే పరిస్థితి లేదు. గతేడాది అధిక వర్షంతో పంటంతా నష్టపోయింది. ఈ ఏడాది వర్షం రాక నష్టపోతామని భయంగా ఉంది. 


రూ. వేలు పెట్టుబడి పెట్టాం : పుల్లారెడ్డి, చిగిచెర్ల, రైతు 

 పంట సాగు చేసి మూడు నెలలు కావస్తోంది. ప్రస్తుతం పంట కాయదశలో ఉంది. వర్షం రాకపోవడంతో ఆందోళనగా ఉంది. వేలకు వేలు పెట్టుబడులు పెట్టి తీరా పంట దిగుబడి సమయంలో వాన రాకపోయే సరికి ఆందోళనగా ఉంది. వాన వస్తే అంతో.. ఇంతో పంట దిగుబడి వస్తుందని లేదంటే.. నష్టమే.