పంట నష్టపరిహారం ప్రకటించాలి

ABN , First Publish Date - 2021-12-02T06:26:22+05:30 IST

: రైతులకు ప్రభుత్వం ఎంత నష్టపరిహారం ఇస్తుందో వెంటనే ప్రకటించాలని రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు, సీపీఎం జిల్లా ఉత్తర ప్రాంత కార్యదర్శి రాంభూపాల్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

పంట నష్టపరిహారం ప్రకటించాలి
మాట్లాడుతున్న రాంభూపాల్‌

 సీపీఎం జిల్లా ఉత్తర ప్రాంత కార్యదర్శి రాంభూపాల్‌

విడపనకల్లు, డిసెంబరు 1: రైతులకు ప్రభుత్వం ఎంత నష్టపరిహారం ఇస్తుందో వెంటనే ప్రకటించాలని రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు, సీపీఎం జిల్లా ఉత్తర ప్రాంత కార్యదర్శి రాంభూపాల్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బుధవారం మండలంలోని పెద్దకొ ట్టాలపల్లి, మాళాపురం, గ్రామాల మీదుగా రైతు కూలీ రక్షణ పాదయాత్ర విడపనకల్లు గ్రామం చేరుకుంది. మహిళలు, టీడీపీ నాయకులు పాల్గొని పాదయాత్రకు  స్వాగతం పలికారు. స్థానిక బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాంభూపాల్‌ మాట్లాడుతూ విడపనక ల్లు మండలంలో రోడ్డుకు ఇరు వైపులా చూస్తూ వస్తున్న సమయంలో ప్రతి పొలంలోను పంటలు పూర్తిగా కుళ్లిపోయి ఎండి పోయాయన్నారు. ఏ పంటలో కూడా రైతుకు ఒక్క గింజ విత్తనం వచ్చే పరిస్థితి లేదన్నారు. మిరప, వరి, జొన్న, పప్పుశనగ, వేరుశనగ, పంటలు పూర్తిగా దెబ్బతిని రైతులు లక్షల్లో నష్టపోయారని, వారిని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. జిల్లా  ఇనచార్జ్‌ మంత్రి బొత్స సత్యనారాయణ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కూడా  ఏ పంటకు ఎంత నష్ట పరిహారం ఇస్తారనే దానిపై స్పష్టత ఇవ్వలేదన్నారు. రైతులు బ్యాంకుల్లో తీసుకున్న రుణాలు మాఫీ చేయాలన్నారు. నష్ట పరిహారం వంద శాతం ఇవ్వాలన్నారు. ప్రస్తుతం ప్రత్యామ్నాయ విత్తనాలను రైతులకు ఉచితంగా ఇచ్చి ఆదుకోవాలన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు చం ద్రశేఖర్‌ రెడ్డి, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి మ ధుసూదన, వ్వవసాయ కార్మిక సంఘం నాయకుడు కృష్ణ మూర్తి, నాగేంద్ర, రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గేయానంద్‌, సీపీఐ  నియోజకవర్గ స హాయ కార్యదర్శి ఎంబీ చెన్న రాయుడు, మండల కార్యదర్శి రమేష్‌, టీడీపీ నాయకులు అనంతపురం పార్లమెంటరీ కార్యదర్శి హనుమంతు, వీ కొత్తకొట సర్పంచ తిమ్మరాజు, విడపనకల్లు సర్పంచ చం ద్రశేఖర్‌, నాయకులు రంగస్వామి, హుస్సేనపీరా, నాగరాజు, అంగనవాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-02T06:26:22+05:30 IST