Advertisement
Advertisement
Abn logo
Advertisement

పంట నష్ట పరిహారం వెంటనే చెల్లించాలి

తెలుగు రైతు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాటకొండ మధుబాబు


మదనపల్లె టౌన్‌, డిసెంబరు 3: వరదలతో పంటలు దెబ్బతిన్న రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని తెలుగు రైతు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాటకొండ మధుబాబు డిమాండ్‌ చేశారు. శుక్రవారం మదనపల్లె మండలం బెస్తపల్లె వద్ద రైతులు పండించిన వరి పంటను మధుబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కోత దశలో ఉన్న వరి అధిక వర్షాలతో దెబ్బతిందన్నారు. ప్రభుత్వం   పరిశీలించి తూతూమంత్రంగా కాకుండా ఎకరాకు రూ.లక్ష చొప్పున పరిహారం చెల్లించాలన్నారు. కార్యక్రమంలో వెంకటేష్‌, పూల మురళి, తిమ్మరాయుడు తదితరులు పాల్గొన్నారు.


Advertisement
Advertisement