Advertisement
Advertisement
Abn logo
Advertisement

రామయ్య పంటకు వానర హారతి

గోకవరం, డిసెంబరు 3: శ్రీరామతత్వం ప్రచారంలో మండలంలోని అచ్యుతాపురంలో రామయ్య పంటకు వానరహారతిని శుక్రవారం నిర్వహించారు. 12వ కోటి తలంబ్రాల జ్ఞానయజ్ఞంలో భాగంగా కోటి తలంబ్రాల పంటకు శ్రీరామా అష్టోత్తర శతనామ స్తోత్రం హనుమాన్‌ చాలీసా, శ్రీరామరక్షస్తోత్రం పఠించి హారతి ఇచ్చారు. శ్రీకృష్ణ చైతన్య సంఘం అధ్యక్షుడు కళ్యాణం అప్పారావు మాట్లాడుతూ ఈ పొలంలో పండించిన వరి పంట ద్వారా సేకరించిన గింజలను గోటితో ఒలిచి భద్రాచలం, ఒంటిమిట్టల్లో జరిగే శ్రీసీతారాముల కల్యాణాలకు సమర్పిస్తామన్నారు. అనంతరం ఆంజనేయుడు, అంగదుడు, సుగ్రీవుడు, జాంబవంతుడు, శ్రీరాముడు వేషధారణలతో భక్తులు శ్రీరామ కీర్తనలు ఆలపిస్తూ పంట కోత ప్రారంభించారు.


Advertisement
Advertisement