పచ్చి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందే

ABN , First Publish Date - 2021-10-27T06:54:17+05:30 IST

జిల్లాలో రైతుల వద్దనున్న పచ్చి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, ఆర బెట్టుకునే అవకాశం రైతులకు లేదని, వారికి న్యాయం చేయాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి డిమాండ్‌ చేశారు.

పచ్చి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందే
ఏడీబీ రోడ్డులో ధాన్యం ఆరబోసి నిరసన వ్యక్తం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, రైతు ప్రతినిధులు

ఏడీబీ రోడ్డులో రైతుల నిరసనలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి

రంగంపేట, అక్టోబరు 26: జిల్లాలో రైతుల వద్దనున్న పచ్చి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, ఆర బెట్టుకునే అవకాశం రైతులకు లేదని, వారికి న్యాయం చేయాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి డిమాండ్‌ చేశారు. మంగళవారం ఆయన వడిశలేరు వద్ద ధాన్యాన్ని రోడ్డుపై ఆరబెట్టి టీడీపీ నాయకులతో కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. రైతులనుద్దేశించి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు చేయమని ఇటీవల మిల్లర్లు ప్రకటించడాన్ని తప్పుబట్టారు. పండిన ధాన్యాన్ని ఆరబెడితే ప్రకృతి వైపరీత్యాలకు రైతు లు బలవుతారన్నారు. గతంలో ఉభయగోదావరి జిల్లాల్లో మిల్లర్లు, దళారులు కలిపి రైతుల నుంచి రూ.2 వేల కోట్లు దోచేశారని విమర్శించారు. కాగా ఏడీబీ రోడ్డుపై నిరసనతో కిలో మీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి. విష యం తెలుసుకున్న ఎస్‌ఐ రామకృష్ణ, డిప్యూటీ తహశీల్దార్‌ సూర్యప్రభ వచ్చి ఆందోళనకారులతో చర్చలు జరిపారు. డిప్యూటీ తహశీల్దార్‌ ఉన్నతాధికారులతో ఫోనులో మాట్లాడి ఆర్బీకేల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్ప డంతో ఆందోళన విరమించారు. అంతకుముందు వడిశలేరులో రైతుల ఇళ్ల వద్ద ఆరబోసిన ధాన్యాన్ని రామకృష్ణారెడ్డి పరిశీలించారు. ఆందోళనలో టీడీపీ నాయకుడు ఆళ్ల గోవిందు, మండల శాఖ అధ్యక్షుడు వీ సత్తిబాబు, కార్యదర్శి శ్రీనివాస్‌, నాయకులు పోతుల వెంకట్రావు, ఏ వెంకట్రావు, బుల్లిదొర, చావ శ్రీను, ఎస్‌ నాగేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-27T06:54:17+05:30 IST