Abn logo
Nov 28 2020 @ 00:20AM

నష్టపోయిన ప్రతి రైతునూ ఆదుకోవాలి

దువ్వూరు, నవంబరు 27: నివర్‌ తుఫాను కారణంగా రాష్ట్రవ్యాప్తంగా దెబ్బతిన్న ప్రతి రైతునూ ఆదుకోవాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి డిమాండ్‌ చేశారు. శుక్రవారం దువ్వూరు మండలంలోని మాచనపల్లె గ్రామంలో నీటమునిగిన వరి, పసుపు, శనగ, పత్తిపంటలను ఆయన పరిశీలించారు. కాగా ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో వరద తాకాడికి 9,720 కోట్ల మేర నష్టం వాటిల్లిందని, చాలాచోట్ల నిజమైన రైతులకు నష్టపరిహారం అంద లేదన్నారు. నివర్‌ తుఫాను బాధితులను గుర్తించి న్యాయం చేయ కపోతే ధర్నాలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు ఆర్‌.శ్రీనివాసులు, సాకం రామసుబ్బారెడ్డి, నాగేశ్వరరెడ్డి, చంద్రశేఖర్‌ రెడ్డి, చిన్నవీరయ్య, రామిరెడ్డి, రవీంద్రారెడ్డిలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement