Abn logo
Sep 24 2021 @ 00:56AM

పంటనష్టం .. రైతులకు కష్టం

మామడ మండలం లింగాపూర్‌ గ్రామంలో కురిసిన వర్షానికి దెబ్బతిన్న మొక్కజొన్న పంట

నీటి మడుగుల్లో వరి, పత్తి, సోయాబీన్‌

తడిసి ముద్దవుతున్న ఆరబె ట్టిన మొక్కజొన్న

మొలకలతో కోల్పోతున్న పంటనాణ్యత

నిర్మల్‌, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో కురుస్తున్న అధికవర్షాలు పంట కు గండంగా మారాయి. ప్రతీరోజూ ఏదో ఒక సమయంలో వర్షాలు కురియడం గత రెండు నెలల నుండి సహజంగా మారింది. వాతావరణం పొడిగా మారుతున్న సమయంలో.. వర్షం భారీ ఎత్తున కురిసి అతలాకుతలం చేస్తోంది. ఇలా కురుస్తున్న వర్షాల కార ణంగా వరి, పత్తి, సోయాబీన్‌, మొక్కజొన్న తదితర పంటలు తీవ్ర నష్టాల పాలవుతున్నాయి. ముఖ్యంగా చేతికొచ్చిన మొక్కజొన్న పంట వర్షాల కారణంగా ముద్దవుతోంది. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా మొక్క జొన్నను సాగు చేసిన రైతులు పంట చేతికి రావడంతో కోసి ఆరు బయట ఆరబెడుతున్నారు. అయితే భారీవర్షాలతో ఇలా ఆరబెట్టిన మొ క్కజొన్న పంట పూర్తిగా తడిసిపోతుంది. దీంతో చాలా చోట్ల మొక్కజొన్న కంకులు మొలకలు సైతం వస్తున్రాయి, మొక్కజొన్న పంట కొనుగోలు ప్రక్రియను ప్రభుత్వం ఈసారి చేపట్టే అవకాశాలు లేవంటున్నారు. రైతులు గత్యం తరం లేక ఈ మొక్కజొన్న పంటనంతా ప్రైవేట్‌ వ్యాపారులకే అమ్ము కోవాల్సివస్తోంది. అయితే వర్షాల కారణంగా తడిసిపోయి మొలకలు రావటంతో మొక్కజొన్న నాణ్యతను కోల్పోతుందని రైతులు వాపోతు న్నారు. దీని కారణంగా ప్రైవేట్‌ వ్యాపారులు ఈ మొక్కజొన్నను కొను గోలు చేసేందుకు ముందకు రాకపోవ చ్చునని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే వరి, పత్తి, పంటలన్నీ వర్షాల కారణంగా నీటిలోనే మునిగి తేలుతున్నాయి. దీంతో ఈ రెండు పంటల దిగుబడులపై అనుమానాలు తలెత్తుతున్నాయి. రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజూ నీటిలోనే ఈ పత్తి, వరి పంటలు మునిగి ఉంటుండటంతో దిగుబడులు రాకపోవచ్చంటున్నారు. ఒకవేళ దిగుబడులు వచ్చినా ఆ పంటలో నాణ్యత ఉండదని రైతులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా ముధోల్‌ నియోజకవర్గంలో సాగవుతున్న సోయాబీన్‌ పంట సైతం మొల కలు వచ్చాయి. నియోజకవర్గంలో దాదాపు పద్దెనిమిది వేల ఎకరాల్లో సోయాబీన్‌ పంటలను సాగుచేస్తున్నారు. అ యితే ప్రస్తుతం ఐదు వేల ఎకరాలకు సం బంధించిన సోయాబీన్‌ పంటకు మొలకలు వచ్చా యని చెబుతున్నారు. జిల్లావ్యాప్తంగా ఈ ఖరీఫ్‌సీజన్‌లో వరి 1,15,912.32 ఎకరాల్లో, మొక్కజొన్న 22,474.38 ఎకరాల్లో, పత్తి 1,58,894.12 ఎకరాల్లో, సోయాబీన్‌ 81,130 ఎకరాల్లో, మినుము 3138, పెసర 230, కంది 16,930 జొన్న, 59.35 ఎకరాల్లో ఖరీఫ్‌సీజన్‌కు గాను సాగుచేస్తున్నారు. ఈ ఖరీఫ్‌ సీజన్‌లో విస్తారంగా వర్షాలు కురియడంతో రైతులు పంటలసాగుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈసారి భారీగా దిగుబడులు వస్తాయని వారంతా ఆశిస్తున్న సమయంలో వర్షాలు గతి తప్పి కురుస్తున్న కారణం గా పంటచేలన్నీ నీటిలోనే మునిగి తేలుతున్నాయి. దీని కారణంగా సాగవుతున్న పంటలు తడితోనే ఉంటున్నాయి. ఈ పరిణామాలు పంట దిగుబడిపై కారుమబ్బులు కమ్ముకునేలా చేస్తున్నాయంటున్నారు. 

ప్రశ్నార్థకమవుతున్న దిగుబడులు

ఈసారి ఖరీఫ్‌లో వరి, పత్తి, మొక్కజొన్న, సోయాబీన్‌ పంటల దిగుబడులు భారీగా వస్తాయని వ్యవసాయశాఖ అధికారులు లెక్కలు కడుతున్నారు. ఖరీఫ్‌ మొదట్లోనే వర్షాలు విస్తారంగా కురియడంతో ఇటు అధికారులు, అటు రైతులు సాగుసంబరాలు మొదలు పెట్టారు. అయితే వర్షాలు ఉన్నట్టుండి కురియడం, ఆ తర్వాత ఎండవేడిమి కొనసాగడం లాంటి పరిస్థితులు నెలకొంటున్నాయి. దీంతో జిల్లావ్యాప్తంగా చాలా చోట్ల ఈ పంటలన్నీ నీటిలోనే ఉండిపోతున్నాయి. ప్రస్తుతం పొలాల్లో వరి పంట మోకాళ్లలోతు నీటిలో తేలియాడుతుంది. దీని కారణంగా ధాన్యం దిగుబడి రావడం కష్టమేనని, అరకొరగా దిగుబడి వచ్చినప్పటికీ ఆ ధా న్యం నాణ్యత కోల్పోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. అలాగే ఇప్పటికే మొక్కజొన్న, సోయాబీన్‌ పంటలు తడిసిపోయి వాటికి మొలక లు రావడంతో ఆ పంటల దిగుబడి పై ప్రభావం పడుతుందంటున్నారు. ముధోల్‌ మండలంలో సోయాబీన్‌ పరిస్థితి మరింత దారుణంగా మారిందని అంటున్నారు. ఆ పంటకు మొలకలు రావడంతో రైతులు చేతికొచ్చిన పంట నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే నిర్మల్‌, లక్ష్మణచాంద, మామడ మండలాల్లో ఆరబెట్టిన మొక్కజొన్న పంట అంతా తడిసి పోయి మొలకలు వచ్చాయి. దీంతో ఈ పంటపూర్తిగా నాణ్యతను కోల్పోయిందని, తద్వారా ఈ పంటను అమ్ముకోవడం ఎలాగ ని రైతులు మనోవేదనకు లోనవుతున్నారు.