Advertisement
Advertisement
Abn logo
Advertisement

1.23 లక్షల ఎకరాల్లో పంట నష్టం

ఒంగోలు (జడ్పీ) : పంట నష్టం అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ నెల 27 నాటికి 75,906.41 ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆది, సోమవారాల్లో కురిసిన వర్షాలకు మరో 22,218.59 ఎకరాల్లో పంట దెబ్బతిన్నట్లు అంచనా వేశారు. ఉద్యాన పంటలకు 18,000 ఎకరాల్లో నష్టం వాటిల్లగా అందులో మిర్చి అత్యధికంగా 14,000 ఎకరాల్లో ఉంది. పొగాకు 6,875 ఎకరాల్లో దెబ్బతిన్నట్లు బోర్డు అధికారులు అంచనా వేశారు. ఖరీ్‌ఫతో పోల్చితే రబీ సాగుపై వాయుగుండం ప్రభావం అధికంగా పడింది. ఖరీ్‌ఫలో 40,889ఎకరాలకు నష్టం వాటిల్లగా, రబీకి వచ్చే సరికి అది 57,236 ఎకరాలుగా ఉంది. ఖరీ్‌ఫకు సంబంధించి 30 మండలాలలో నష్టం అంచనాలు లెక్కకట్టగా, రబీలో అది 33 మండలాలకు చేరింది.  ఇదిలా ఉండగా పంట నష్టపోయిన రైతుల కోసం ఒంగోలులోని కలెక్టర్‌లో కంట్రోల్‌రూంను ఏర్పాటు చేశారు. బాధిత రైతులు టోల్‌ఫ్రీ నెంబర్‌ 1077, ల్యాండ్‌లైన్‌ 08592 281400కు ఫోన్‌ చేసి వివరాలు తెలియజేయాలని జేడీఏ శ్రీనివాసరావు కోరారు. 

పంటల వారీగా నష్టం వివరాలు(ఎకరాల్లో)

పంట                      ఖరీఫ్‌                  రబీ

ధాన్యం                     7,205                 1291

పత్తి                      21,010                  -----

మినుము                   7121                  21189

మొక్కజొన్న                 3005                   399

వైట్‌బర్లీ 523                 4627

శనగ                        -----                28,779

ఇతరపంటలు               2,025                   951

---------------------------------------------------------------------------

మొత్తం                   40,889                57,236

------------------------------------------------------------------------

ఖరీఫ్‌, రబీ రెండు సీజన్లు కలిపి  98,125

ఉద్యాన పంటలు              18,000

పొగాకు 6,875 

--------------------------------------------------

మొత్తం నష్టం విస్తీర్ణం        1,23,00 ఎకరాలు

-----------------------------------------------------------


Advertisement
Advertisement