61మండలాల్లో పంటనష్టం

ABN , First Publish Date - 2021-11-27T07:27:48+05:30 IST

వరద నష్టాలను పరిశీలించడానికొచ్చిన కేంద్రబృందం తిరుచానూరులోని గ్రాండ్‌రిడ్జ్‌ హోటల్‌లో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించింది.

61మండలాల్లో పంటనష్టం
ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకిస్తున్న కేంద్ర బృందం

కేంద్రబృందానికి వివరించిన అధికారులు


తిరుచానూరు, నవంబరు 26: వరద నష్టాలను పరిశీలించడానికొచ్చిన కేంద్రబృందం తిరుచానూరులోని గ్రాండ్‌రిడ్జ్‌ హోటల్‌లో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించింది. వివిధ విభాగాలకు సంబంధించి జరిగిన నష్టాన్ని శాఖాధిపతులు కేంద్రబృందానికి వివరించారు.  బాధితులకు నిత్యావసరాల పంపిణీ, పునరావాస కేంద్రాల ఏర్పాటు, మంత్రుల పరామర్శ తదితర వివరాలను వివరించారు. అనంతరం కలెక్టర్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా జిల్లాలో జరిగిన నష్టాలు, తాత్కాలిక, శాశ్వత పునరుద్ధరణకు కావలసిన అంచనాలను తెలిపారు.ఈ నెల 6నుంచి 11వ తేది వరకూ,18నుంచి 21వ తేది వరకూ కురిసిన భారీ వర్షాలతో 61మండలాల్లో పంటనష్టం జరిగిందని,2,099గృహాలు పాక్షికంగా దెబ్బ తిన్నాయని వివరించారు.రెండు రోజుల్లో మళ్లీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికల నేపథ్యంలో అన్ని శాఖలనూ అప్రమత్తం చేశామన్నారు. జిల్లాలో శాఖలవారీగా జరిగిన నష్టాలపై సమగ్ర నివేదిక సమర్పించాలని, ఆ నివేదిక ఆధారంగా కేంద్రప్రభుత్వం జిల్లాకు ఆర్థిక సాయం అందించేందుకు చర్యలు తీసుకుంటుందని బృంద సభ్యులు తెలిపారు. వరదబాధితులకు అందుతున్న సహాయసహకారాలను కేంద్రం బృందం ప్రశంసించిందని అధికారులు తెలిపారు. జేసీ రాజాబాబు,ఆర్డీవో కనకనరసారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-27T07:27:48+05:30 IST