పంటల కొనుగోళ్లు షురూ

ABN , First Publish Date - 2020-08-11T09:58:01+05:30 IST

నగరంలోని వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం పంటలు కొనుగోళ్ళు ప్రారంభమయ్యాయి.

పంటల కొనుగోళ్లు షురూ

ఖమ్మం మార్కెట్‌లో 25రోజుల తరువాత లావాదేవీలు


ఖమ్మం మార్కెట్‌, ఆగస్టు 10: నగరంలోని వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం పంటలు కొనుగోళ్ళు ప్రారంభమయ్యాయి. కరోనా వైరస్‌  నేపఽథ్యంలో సుమారు 25రోజుల ప్రత్యేక సెలవుల విరామం అనంతరం మార్కెట్‌లో తిరిగి లావాదేవీలు సాగాయి. మార్కెట్‌లో సాధారణ రకం ఎండుమిరప, కోల్డ్‌ స్టోరేజీలలో నిల్వ ఉంచిన ఏసీ మిర్చీతో పాటు కొద్దిమొత్తంలో పత్తి అమ్మకానికి వచ్చింది. దీంతో ఉదయం 7గంటలకు నిర్వహించిన జెండా పాటలో ఏసీ మిర్చి ధరను క్వింటాలు రూ.14,300గా నిర్ణయించగా నాణ్యతను బట్టి క్వింటాలు గరిష్టంగా రూ.12,500, కనిష్టంగా రూ.7,500కు వ్యాపారులు కొనుగోలు చేశారు. కొనుగోళ్లను మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌  మద్దినేని వెంకటరమణ, ఉన్నత శ్రేణి కార్యదర్శి ఆర్‌. మల్లేశం, మార్కెట్‌ గ్రేడ్‌ టూ సెక్రెటరీ బజారు తదితరులు సమీక్షించారు.


గుమ్మస్తాల సంఘం నాయకుడికి నివాళి

నగరంలోని వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం  అనారోగ్యంతో మృతి చెందిన మార్కెట్‌ గుమ్మస్తాల సంఘం కార్యదర్శి ఎ. ఐలయ్యకు మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌  మద్దినేని వెంకటరమణ, ఉన్నత శ్రేణి కార్యదర్శి ఆర్‌. మల్లేశం నివాళులు అర్పించారు.  ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో మిర్చిశాఖ అధ్యక్షుడు మాటేటి నాగేశ్వర రావు, దిగుమతిశాఖ అధ్యక్ష, కార్యదర్శులు దిరిశాల వెంకటేశ్వర్లు, బజ్జూరి రమణారెడ్డి, గుమ్మస్తాల షంఘం అధ్యక్షుడు బండారు యాకయ్య, పలువురు వ్యాపారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-08-11T09:58:01+05:30 IST