Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆరుతడి పంటలు వేయాలి

జిల్లా వ్యవసాయాధికారి అనురాధ

భూదానపోచంపల్లి, డిసెంబరు 8: యాసంగిలో రైతులు వరికి బదులుగా ఆరుతడి పంటలు వేయాలని జిల్లా వ్యవసాయాధికారి అనురాధ అ న్నారు. బుధవారం భూదానపోచంపల్లిలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతులకు ఆరుతడి పంటలపై నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో గత యాసంగి సీజనలో సుమారు 2.40 లక్షల ఎకరాల్లో వరిసాగు చేశారని, ఇప్పటికే ధాన్యం నిల్వలు ఎక్కువగా పేరుకుపోయాయని తెలిపారు. భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) వరి కొనుగోలు చేయ బోమన్న నేపథ్యంలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని సూచించారు. మూసీ పరివాహక ప్రాంతంలో వరికి ప్రత్యామ్నాయంగా మినుములు, నువ్వులు, వేరుశెనగతో పాటు బంతిపూల సాగు లాభసాటిగా ఉంటుందన్నారు. మూసీ పరివాహకం కావడం, హైదరాబాద్‌ దగ్గర్లో ఉన్నందున అరటిపంట వేస్తే అరటి తోటలు వేయాలని సూచించారు. అరటి పళ్లతో పాటు హోటళ్లలో అరటి ఆకులను కూడా సప్లై చేసి అధిక లాభాలు పొందవచ్చని పేర్కొన్నారు. భూమిలో ఏ పంట వేశామన్నది ముఖ్యం కాద ని, ఎంత లాభం ఆర్జించామనేది ముఖ్యమన్నారు. పెద్ద రైతులు తమ పొలా ల్లో మిగతా పంటలతో పాటు వెదురు చేయాలని సూచించారు. యాసంగిలో వరి వేసి రైతులు ఇబ్బందులు పడకుండా కూరగాయలు సాగు చేసుకో వాలని సూచించారు. సమావేశంలో పీఏసీఎస్‌ చైర్మన కందాడి భూపాల్‌రెడ్డి, ఏవో ఎజాజ్‌ అలీఖాన, ఏఈవో నరేష్‌, రైతులు పాల్గొన్నారు.


Advertisement
Advertisement