స్పా ముసుగులో క్రాస్‌ మసాజ్‌

ABN , First Publish Date - 2020-11-13T12:35:04+05:30 IST

స్పా ముసుగులో అనైతిక కార్యకలాపాలు జరుగుతున్నాయనే

స్పా ముసుగులో క్రాస్‌ మసాజ్‌

హైదరాబాద్‌ : స్పా ముసుగులో అనైతిక కార్యకలాపాలు జరుగుతున్నాయనే సమాచారంతో గురువారం సాయంత్రం వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు నిర్వహించారు. ఎస్సార్‌నగర్‌‌లోని స్టార్‌ ఫ్యామిలీ సెలూన్‌ పేరిట మసాజ్‌, స్పాసెంటర్‌ కొనసాగుతోంది. అందులో క్రాస్‌ మసాజ్‌ జరుగుతోందనే ఫిర్యాదు అందడంతో వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ గట్టుమల్లు తన బృందంతో దాడి చేసి స్పాసెంటర్‌ యజమాని నాగేందర్‌ను అదుపులోకి తీసుకుని ఇద్దరు యువతులను రక్షించారు. అనంతరం వారిని ఎస్సార్‌నగర్‌ పోలీసులకు అప్పగించారు. 

Updated Date - 2020-11-13T12:35:04+05:30 IST