Abn logo
Sep 26 2021 @ 23:54PM

సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ దుర్మరణం

గొర్రె రాజవంశీ (ఫైల్‌ ఫొటో)

చిలకలూరిపేట, సెప్టెంబరు 26: మండలంలోని తాతపూడి పరిధిలో ఆదివారం జరిగిన  రోడ్డు ప్రమాదంలో ఓ సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ దుర్మరణం చెందారు. రూరల్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రకాశం జిల్లా యద్దనపూడి ఎస్సీ కాలనీకి చెందిన గొర్రె ఏడుకొండలు, రాణి దంపతులకు కుమారుడు గొర్రె రాజవంశీ (25), కుమార్తె త్రివేణి ఉన్నారు. రాజవంశీ జార్ఘండ్‌లో సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. వినాయకచవితికి ముందు సెలవులకు గ్రామానికి వచ్చారు. ఆదివారం పనిమీద చిలకలూరిపేట వచ్చిన రాజవంశీ ద్విచక్రవాహనంపై జాతీయ రహదారి సర్వీసు రోడ్డు గుండా తిరిగి తన స్వగ్రామం యద్దనపూడి వెళుతున్నారు. ఈ క్రమంలో తాతపూడి పరిధిలో ద్విచక్రవాహనం గేదెను ఢీకొనడంతో రాజవంశీ కిందపడి తీవ్రగాయాలపాలయ్యారు. స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించేలోపే అతను మృతిచెందారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు  రూరల్‌ ఎస్‌ఐ రాజేష్‌ తెలిపారు.