Advertisement
Advertisement
Abn logo
Advertisement
Sep 8 2021 @ 11:11AM

Bengal: బీజేపీ ఎంపీ ఇంటిపై నాటు బాంబుల దాడి

కోల్‌కతా:పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బారక్‌పూర్‌ పట్టణంలో ఉన్న బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ నివాసంపై కొందరు దుండగులు బుధవారం నాడు బాంబులు విసిరారు.బుధవారం తెల్లవారుజామున కొంతమంది దుండగులు ప్రధాన ద్వారం వద్ద 3 నాటు బాంబులను విసిరారు.ఈ బాంబుల దాడిలో అర్జున్ సింగ్ కుటుంబ సభ్యులెవరూ గాయపడకపోయినప్పటికీ, ఈ సంఘటన గేట్ వెలుపల కేంద్ర భద్రతాసిబ్బంది సమక్షంలో జరిగింది. అర్జున్ సింగ్‌కు కేంద్ర ప్రభుత్వం కేంద్ర బలగాలతో సెక్యూరిటీ కల్పించింది.ఈ సంఘటన జరిగిన వెంటనే పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్‌ఖర్ ట్విట్టర్‌లోకి వెళ్లి, ‘‘పశ్చిమ బెంగాల్‌లో  హింస తగ్గుముఖం పట్టడం లేదు. 

పార్లమెంట్ సభ్యుడు అర్జున్ సింగ్ నివాసం వెలుపల ఈ ఉదయం బాంబు పేలుళ్లు శాంతిభద్రతలపై ఆందోళన కలిగిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ పోలీసుల సత్వర చర్యలు ఆశిస్తున్నాను’’ అని ట్వీట్ చేశారు.బారక్‌పూర్ కమిషనరేట్ నుంచి పోలీసు బలగాలను భారీ సంఖ్యలో ఎంపీ నివాసానికి తరలించారు. నిందితులను గుర్తించడానికి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


Advertisement
Advertisement