సముద్రంలోనే ఫ్లూ వైరస్ రోగులున్న విహారనౌక‌...

ABN , First Publish Date - 2020-03-30T18:12:09+05:30 IST

వైరస్ బారిన పడిన విహారనౌకను నిలిపేందుకు కావాల్సిన ఓడరేవు అనుమతి కోసం క్రూయిజ్ కంపెనీ శోధిస్తోంది....

సముద్రంలోనే ఫ్లూ వైరస్ రోగులున్న విహారనౌక‌...

నిలిపే ఓడరేవు కోసం క్రూయిజ్ కంపెనీ శోధన

పనామా సిటీ :  వైరస్ బారిన పడిన విహారనౌకను నిలిపేందుకు కావాల్సిన ఓడరేవు అనుమతి కోసం క్రూయిజ్ కంపెనీ శోధిస్తోంది. కరోనా వైరస్ భయంతో ఫ్లూ వైరస్ ప్రబలిన రోగులకు చికిత్స చేసి ఆదుకునే ఓడరేవు కోసం చూస్తున్న ఈ విహారనౌక ప్రస్థుతం సెంట్రల్ అమెరికాలోని పనామా కెనాల్‌లో ఉంది. అట్లాంటిక్, ఫసిఫిక్ సముద్రాలను కలిపే పనామా కెనాల్ ఉన్న విహార నౌకలో ఆరోగ్యంగా ఉన్నవారిని మరో నౌకలోకి పంపించారు. కరోనా రోగులున్న నౌకను తమ ఓడరేవులోకి అనుమతించి ప్రమాదం తెచ్చుకోలేమని ఫ్లోరిడా సిటీ మేయర్ చెప్పారు. 1800 మంది ఉన్న ఈ విహార నౌకలో 12 మంది ఫ్లూ సంబంధిత లక్షణాలతో బాధపడుతున్నారు. ఈ నౌకను నిలిపే ఓడరేవు కోసం మార్చి 14వతేదీ నుంచి సముద్రంలోనే నిలిపి చూస్తున్నామని క్రూయిజ్ సంస్థ తెలిపింది. 


Updated Date - 2020-03-30T18:12:09+05:30 IST