క్రిప్టోకరెన్సీ రికార్డ్... బిట్ కాయిన్ వాటా సగానికి పైగానే...

ABN , First Publish Date - 2021-04-06T21:29:31+05:30 IST

క్రిప్టోకరెన్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ సోమవారంనాటికి రెండు ట్రిలియన్ డాలర్లను చేరుకుంది. ఇది ఆల్ టైమ్ గరిష్టం.

క్రిప్టోకరెన్సీ రికార్డ్... బిట్ కాయిన్ వాటా సగానికి పైగానే...

ముంబై : క్రిప్టోకరెన్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ సోమవారంనాటికి  రెండు ట్రిలియన్ డాలర్లను చేరుకుంది. ఇది ఆల్ టైమ్ గరిష్టం. మార్కెట్ ట్రాకర్స్ కాయిన్‌జెక్కో అండ్ బ్లాక్ ఫోలియో డేటా ఈ వివరాలను వెల్లడించింది. కొద్ది నెలలుగా టెస్లా ఇంక్, మాస్టర్ కార్డ్, వీసా వంటి దిగ్గజ సంస్థలు బిట్ కాయిన్ వంటి క్రిప్టోలను యాక్సెప్ట్ చేస్తుండడం లేదా కొనుగోలు చేస్తుండడంతో ఇన్వెస్టర్లు ఆ దిశగా దృష్టి సారించారు. కరోనా అనంతరం ఇనిస్టిట్యూషనల్, రిటైల్ ఇన్వెస్టర్లు ఇలా ఇరువురిని క్రిప్టోకరెన్సీ ఆకర్షించింది. 


ఇక క్రిప్టోకరెన్సీలో బిట్‌కాయిన్‌దే ప్రముఖపాత్రగా ఉంది. బిట్ కాయిన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ట్రిలియన్ డాలర్లు దాటిపోయిన విషయం తెలిసిందే. అంతకుముందు వారం 61 డాలర్లకు చేరుకున్న బిట్ కాయిన్ గతవారం 59,045 డాలర్ల వద్ద ముగిసింది. అయినప్పటికీ గతవారం 1.4 శాతం వృద్ధిని నమోదు చేసింది. మార్చి మధ్యంలో బిట్ కాయిన్ 61 వేల డాలర్లను క్రాస్ చేసింది. ఆ ధరతో పోలిస్తే 2 వేల డాలర్ల వరకు తక్కువగా ఉంది. ఎథేరియం మార్కెట్ క్యాప్ బిట్ కాయిన్ వ్యాల్యూ 53 వేల డాలర్ల దిగువకు సమీప కాలంలో పడిపోకపోవచ్చునని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అంటే దీని మార్కెట్ క్యాప్ కాస్త అటూఇటుగా ట్రిలియన్ డాలర్లుగా ఉంటుందని చెబుతున్నారు.


సెకండ్ లార్జెస్ట్ బిట్ కాయిన్ ఎథేరియమ్ మార్కెట్ క్యాప్ ఇటీవల 1.3 శాతం ఎగిసి 2,103 డాలర్లకు చేరుకుంది. దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ సోమవారం నాటికి 244 బిలియన్ డాలర్లుగా ఉంది. గత శుక్రవారం 2144.29 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. బిట్ కాయిన్, ఎథేరియం మొత్తం క్రిప్టోకరెన్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2.02 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. బిట్ కాయిన్, ఎథేరియం అంచనాలకు మించి ముందుకు సాగుతున్నట్లుగా  చెబుతున్నారు. ఈ ఏడాది బిట్ కాయిన్ వంద శాతం ఎగసింది. ఎథేరియం 190 శాతం జంప్ చేసింది. ఈ రెండు క్రిప్టోకరె్సీలు కూడా అంతకంతకూ ఎగసిపడుతుండడం గమనార్హం.

Updated Date - 2021-04-06T21:29:31+05:30 IST