మూడు నెలల్లోనే రెండింతలైన క్రిప్టోకరెన్సీ మార్కెట్ విలువ

ABN , First Publish Date - 2021-04-06T14:47:43+05:30 IST

క్రిప్టోకరెన్సీకి మార్కెట్లో డిమాండ్ రోజురోజుకూ పెరుగుతూ పోతోంది. కేవలం మూడు నెలల్లోనే క్రిప్టోకరెన్సీ మార్కెట్

మూడు నెలల్లోనే రెండింతలైన క్రిప్టోకరెన్సీ మార్కెట్ విలువ

న్యూయార్క్: క్రిప్టోకరెన్సీకి మార్కెట్లో డిమాండ్ రోజురోజుకూ పెరుగుతూ పోతోంది. కేవలం మూడు నెలల్లోనే క్రిప్టోకరెన్సీ మార్కెట్ విలువ రెండింతలు అయిందంటే దీని ట్రెండ్ ఎలా నడుస్తుందో అర్థం చేసుకోవచ్చు. సోమవారం నాటికి అన్ని రకాల క్రిప్టోకరెన్సీల మార్కెట్ విలువ 2 ట్రిలియన్ డాలర్లు దాటేసింది. ఇందులో 50 శాతానికి పైగా మార్కెట్ విలువ అతిపెద్ద క్రిప్టోకరెన్సీ అయిన బిట్‌కాయిన్‌కు ఉండటం విశేషం. బిట్‌కాయిన్ మార్కెట్ విలువ దాదాపు 1.1 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. ఈ ఏడాది మొదటి మూడు నెలల్లోనే బిట్‌కాయిన్ ధర 58,800 డాలర్లకు చేరిపోయింది. బిట్‌కాయిన్లతో తమ సంస్థకు చెందిన కార్లను కొనుగోలు చేయొచ్చని అమెరికాకు చెందిన కార్ల దిగ్గజం టెస్లా ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే. బిట్‌కాయిన్ తర్వాత 244 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువతో ఎథెరియం క్రిప్టోకరెన్సీ రెండో స్థానంలో ఉంది.

Updated Date - 2021-04-06T14:47:43+05:30 IST