సీఎస్‌ రివ్యూ చేస్తున్నారు.. జాగ్రత్త

ABN , First Publish Date - 2021-10-19T05:45:26+05:30 IST

ప్రజల నుంచి వచ్చే స్పందన అర్జీలను సీరియస్‌గా తీసుకోవాలని, ఈ అర్జీలపై చీఫ్‌ సెక్రటరీ రివ్యూ చేస్తున్నారని కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు అన్నారు.

సీఎస్‌ రివ్యూ చేస్తున్నారు.. జాగ్రత్త
ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తున్న కలెక్టర్‌, ఇతర అధికారులు

  1. స్పందన అర్జీలను సీరియస్‌గా తీసుకోవాలి
  2. కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు 


కర్నూలు(కలెక్టరేట్‌), అక్టోబరు 18: ప్రజల నుంచి వచ్చే స్పందన అర్జీలను సీరియస్‌గా తీసుకోవాలని, ఈ అర్జీలపై చీఫ్‌ సెక్రటరీ రివ్యూ చేస్తున్నారని కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో స్పందన కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ స్పందన అర్జీల పరిష్కారాన్ని బట్టి చీఫ్‌ సెక్రటరీ జిల్లాలకు ర్యాంకులు ఇస్తున్నారన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు స్పందన అర్జీలను పరిష్కరించాలన్నారు. రెవెన్యూ, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, కాలేజీ ఎడ్యుకేషన్‌ తదితర శాఖల అర్జీలు ఎక్కువగా పెండింగ్‌లో ఉన్నాయని హెచ్చరించారు. 58 అర్జీలు గడువు దాటనవి కాగా.. ఇందులో రెవెన్యూ 9, మున్సిపల్‌ 9, కాలేజీ ఎడ్యుకేషన్‌ 7, పోలీస్‌ 5, స్కూల్‌ ఎడ్యుకేషన్‌ 5, సచివాలయాలు 4, మైన్స్‌ అండ్‌ జియాలజి 3, స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో 3, అగ్రికల్చర్‌ 2, రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ 2, మిగిలిన శాఖలలో ఒక్కొక్కటి పెండింగ్‌లో ఉన్నాయన్నారు. సచివాలయ సిబ్బంది హాజరు శాతం చాలా తక్కువగా ఉందని, ఎంపీడీవోలు ప్రతిరోజూ పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. అనంతరం స్పందన అర్జీలను స్వీకరించారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్లు రాంసుందర్‌ రెడ్డి, డా.మనజీర్‌ జిలానీ సామూన్‌, నారపురెడ్డి మౌర్య, ఎంకేవీ శ్రీనివాసులు, శ్రీశైలం ప్రాజెక్టు స్పెషల్‌ కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా, డీఆర్వో పుల్లయ్య, జడ్పీ సీఈవో వెంకటసుబ్బయ్య, డీఆర్‌డీఏ ఏపీడీ వెంకటసుబ్బయ్య, నేషనల్‌ హైవే స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-19T05:45:26+05:30 IST