Advertisement
Advertisement
Abn logo
Advertisement

భోగి మంటల్లో సీఎస్‌ నివేదిక ప్రతులు

తాడేపల్లిగూడెం రూరల్‌, జనవరి 14: 11వ పీఆర్‌సీ కమిటీ అశుతోష్‌ మిత్రా ఇచ్చిన నివేదికను బయటపెట్టకుండా చీఫ్‌ సెక్రటరీ ఇచ్చిన నివేదికను తెరపైకి తేవడం దారుణమని ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు ఆరోపించాయి. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయం ఎదుట సీఎస్‌ నివేదికను భోగి మంటల్లో వేసి వారి నిరసన  తెలిపారు.  యూటీఎఫ్‌ రాష్ట్ర కౌన్సిలర్‌ పి. శివప్రసాద్‌, రాష్ట్ర పూర్వ కార్యదర్శి ఎం. రామకృష్ణ తదితరులు ఈ నిరసనలో పాల్గొన్నారు. 

కార్మిక వ్యతిరేక జీవోలు.. 

తణుకు: కార్మికులకు వ్యతిరేకంగా తెచ్చిన నాలుగు లేబర్‌ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి పీవీ ప్రతాప్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం అమర వీరుల భవనం వద్ద భోగి మంటల్లో లేబర్‌ కోడ్‌ ఉత్తర్వుల ప్రతులను, రాష్ట్ర ప్రభుత్వం చెత్త పన్ను జీవోలను దహనం చేశారు.  పార్టీ నాయకులు గోపి, కిశోర్‌, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ ఆధ్వర్యంలో..

ఉంగుటూరు:  వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను తెలుపుతూ ఒక్కొక్క భోగి పిడకను మంటలో వేసి సీఎం జగన్‌కు  మంచి బుద్ధి ప్రసాదించాలని బీజేపీ నాయకులు తమ నిరసన తెలిపారు. శుక్రవారం నారాయణపురంలో ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శరణాల మాలతీరాణి ఇంటి వద్ద భోగి మంటలు  వేశా రు.  జిల్లా ఉపాఽధ్యక్షుడు నగరపాటి సత్యనారాయణ, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు అడపా శోభారాణి, పార్టీ మండల అధ్యక్షుడు వంజరపు దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement