కోవిడ్‌ సమయంలో పోస్టల్‌ సేవలు ప్రశంసనీయం: సీఎస్‌

ABN , First Publish Date - 2021-10-18T00:38:02+05:30 IST

కోవిడ్‌ మహమ్మారి విజృంభించిన రోజుల్లోనూ పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌ సేవలు ప్రశంసనీయమని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ అన్నారు.

కోవిడ్‌ సమయంలో పోస్టల్‌ సేవలు ప్రశంసనీయం: సీఎస్‌

హైదరాబాద్‌: కోవిడ్‌ మహమ్మారి విజృంభించిన రోజుల్లోనూ పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌ సేవలు ప్రశంసనీయమని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ అన్నారు. అంకిత భావంతో పనిచేసిన సిబ్బందిని సీఎస్‌ అభినందించారు. ఎంతో రిస్క్‌ తీసుకుని వారు సేవలు అందించారని అన్నారు. ఆదివారం జరిగిన డాక్‌సేవా 2021 అవార్డుల కార్యక్రమానికి సీఎస్‌ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ మాట్లాడుతూ కోవిడ్‌ వ్యాప్తి సమయంలో ఆసరా పెన్షన్‌లను పంపిణీ చేసేందుకు గ్రామాల్లోనూ, తండాల్లోకి వెళ్లి సేవలు అందించారని అన్నారు. అలాగే పట్టాదార్‌పాస్‌పుస్తకాల పంపిణీలోనూ ప్రజల ఇళ్లవద్దకు వెళ్లి విశేషమైన సేవలు అందించారని అన్నారు.


పోస్టల్‌ సిబ్బంది అన్నిసమయాల్లోనూ ఫోర్‌ఫ్రంట్‌గా సేవలు అందించారని అన్నారు. చరిత్రలో సరైన గుర్తింపునకు నోచుకోని ప్రముఖులైన కొమరం భీం, చాకలి ఐలమ్మ, రావినారాయణరెడ్డి, మగ్ధూం మోయినుద్దీన్‌ వంటి వారికి గురించి కూడా మరింత ప్రచారం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఎనిమిది కేటగిరీల్లో అవార్డులను అందిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. వారి నైపుణ్యాన్ని బట్టి రాష్ర్టాస్థాయిలో అధికారులు, సిబ్బందిని గుర్తించి అవార్డులు అందజేస్తున్నారు. 

Updated Date - 2021-10-18T00:38:02+05:30 IST