వరద బాధితులకు ప్రణాళికాబద్దంగా నగదుసాయాన్ని అందించాలి-సీఎస్‌

ABN , First Publish Date - 2020-10-21T20:44:52+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు వరద బాఽధితులకు నగదు సాయం పంపిణీలో అధికారులు ప్రణాళికా బద్దంగా వ్యవహరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ సూచించారు.

వరద బాధితులకు ప్రణాళికాబద్దంగా నగదుసాయాన్ని అందించాలి-సీఎస్‌

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు వరద బాఽధితులకు నగదు సాయం పంపిణీలో అధికారులు ప్రణాళికా బద్దంగా వ్యవహరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ సూచించారు. వ రద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు అందుతున్న సాయం పై సీఎస్‌ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. జీహెచ్‌ఎంసి పరిధిలో 300 మంది సహాయక బృందాలను, మరో 50 బృందాలను గ్రేటర్‌ ఆవల ఉన్న మున్సిపాలల్లో ఏర్పాటు చేసి వరద బాధితులకు ఎలాంటి ఇబ్బందికానీ, ఆలస్యం కాకుండా అధికారులు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. వరదసాయాన్ని పర్యవేక్షించేందుకు జీహెచ్‌ఎంసిలోనూ, సీడీఎంఏ కార్యాలయాల్లో ఒక కంట్రోల్‌రూమ్‌ ఏర్పాటుచేయాలన్నారు. 


వరద ప్రభావిత ప్రాంతాలను గుర్తించడానికి ఒక రూట్‌మ్యాప్‌ను సిద్దం చేయాలన్నారు. ఆయా ప్రాంతాల్లో సహాయం అందించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని అన్నారు. అవసరమైతే ఇతర జిల్లాల నుంచి మనుషునలు రప్పించాలన్నారు. జీహెచ్‌ఎంసి పరిధిలోని ప్రతి సర్కిల్‌ పరిధిలో 10 బృందాలను ఏర్పాటు చేయాలని, ఇందులో ముగ్గురు చొప్పున బృందాలను నగదు పంపిణీని నియమించాలన్నారు. సహాయ బృందాలకు అవసరమైన నగదును సత్వరం చేరవేసేందుకు రూట్‌ ఆఫీసర్స్‌ను వెంటనే నియమించాలని ఆదేశించారు. 


వరద బాఽధితులకు సహాయం చేయడంలో ఎలాంటి ఇబ్బంది రాకుండా రాష్ట్రస్ధాయి బ్యాంకింగ్‌ కన్వీనర్లు చొరవ చూపాలని సెలవురోజుల్లోనూ పనిచేసేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌శాఖ కార్యదర్శి ఆర్వింద్‌కుమార్‌, ఆర్ధిక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రామకృష్ణారావు, ఎస్సీడెవలప్‌మెంట్‌ శాఖ కార్యదర్శి రాహుల్‌బొజ్జ, జీహెచ్‌ఎంసి కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-21T20:44:52+05:30 IST