84 గ్రామాల సమగ్ర అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక పై సీఎస్ సమావేశం

ABN , First Publish Date - 2022-04-23T01:39:36+05:30 IST

చారిత్రక జంటజలాశయాల పరీవాహక ప్రాంతాల్లో ఉన్న 84 గ్రామాల సమగ్ర అభివృద్ధికి సంబంధించిన జీఓ 69 అమలుపై సంబంధిత అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ శుక్రవారం సమావేశం నిర్వహించారు.

84 గ్రామాల సమగ్ర అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక పై సీఎస్ సమావేశం

హైదరాబాద్: చారిత్రక జంటజలాశయాల పరీవాహక ప్రాంతాల్లో ఉన్న 84 గ్రామాల సమగ్ర అభివృద్ధికి సంబంధించిన జీఓ 69 అమలుపై సంబంధిత అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఇటీవల కాలంలోనే జీవో.111ను ఎత్తివేస్తూ ప్రభుత్వం జీవో.69 జారీ చేసింది. ఈ జీవోలో జంటజలాశయాలను కాపాడడంతోపాటు, దాని పరిధిలో వున్న 84 గ్రామాలను అభివ`ద్ధి చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగానే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సూచనల మేరకు మొత్తం ప్రాంతాన్ని గ్రీన్ బఫర్ జోన్‌లుగా అభివృద్ధి చేయుటలో భాగంగా జలవనరుల సంరక్షణ, కాలుష్య నియంత్రణ, హై ఎఫిషియెన్సీ ఎస్టీపీల ఏర్పాటు, మౌళికవసతుల కల్పన, వ్యవస్థాపరమైన నిర్వహణ ఏర్పాటుపై సమావేశంలో చర్చించారు.


ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి  అర్వింద్ కుమార్ , ఆర్ధిక శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి కె. రామకృష్ణారావు , ఇరిగేషన్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ ఎం.డి. దాన కిషోర్, టీఎస్ పీసీబి  సభ్య కార్యదర్శి నీతూప్రసాద్ , వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, హెచ్ఎండిఏ ప్లానింగ్ డైరెక్టర్ బాలకృష్ణ, జీహెచ్ఎంసి సీసీపి దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2022-04-23T01:39:36+05:30 IST