హస్సీకి మళ్లీ పాజిటివ్‌

ABN , First Publish Date - 2021-05-12T10:50:27+05:30 IST

చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే) బ్యాటింగ్‌ కోచ్‌ మైకేల్‌ హస్సీ మళ్లీ పాజిటివ్‌గా తేలాడు. శనివారం నిర్వహించిన పరీక్షలో అతనికి నెగెటివ్‌ వచ్చింది. కానీ,

హస్సీకి మళ్లీ పాజిటివ్‌

న్యూఢిల్లీ: చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే) బ్యాటింగ్‌ కోచ్‌ మైకేల్‌ హస్సీ మళ్లీ పాజిటివ్‌గా తేలాడు. శనివారం నిర్వహించిన పరీక్షలో అతనికి నెగెటివ్‌ వచ్చింది. కానీ, సోమవారం రెండో టెస్ట్‌ చేయగా పాజిటివ్‌గా తేలాడు. కరోనా నుంచి కోలుకునే వరకు హస్సీ చెన్నైలోనే ఐసోలేషన్‌లో ఉండనున్నట్టు సీఎ్‌సకే ప్రకటించింది. నెగెటివ్‌ వస్తే హస్సీ మాల్దీవులలోని ఆస్ట్రేలియా బృందంతో కలిసే అవకాశం ఉంది. ఈనెల 15వ తేదీ తర్వాత ఆస్ట్రేలియాలో అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం ఎత్తివేసే చాన్స్‌ ఉంది. దాంతో మాల్దీవుల నుంచి స్వదేశానికి చేరుకోవాలని కంగారూలు భావిస్తున్నారు. 

Updated Date - 2021-05-12T10:50:27+05:30 IST