సీటీ స్కానింగ్... రూ. 1,999 మాత్రమే... వ్యాక్సిన్ ఎమ్మార్పీకి మించితే ఆసుపత్రుల సీజ్...

ABN , First Publish Date - 2021-05-18T02:00:44+05:30 IST

కరోనా వ్యాక్సిన్... మంగళవారం నుంచి రూ. 1,999 లకే అందుబాటులోకి రానుంది. మరిన్ని వివరాలిలా ఉన్నాయి.

సీటీ స్కానింగ్... రూ. 1,999 మాత్రమే... వ్యాక్సిన్ ఎమ్మార్పీకి మించితే ఆసుపత్రుల సీజ్...

మహబూబ్‌నగర్ : కరోనా వ్యాక్సిన్... మంగళవారం నుంచి రూ. 1,999 లకే అందుబాటులోకి రానుంది. మరిన్ని వివరాలిలా ఉన్నాయి. కరోనా సోకిన పేద ప్రజలు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లాలంటే బిల్లు లక్షల్లో ఉంటోన్న విషయం తెలిసిందే. పరీక్షలు చేయించుకోలేక,  టీకాలకు డబ్బు చెల్లించలేక దీన స్థితిలో తనువుచాలిస్తున్నారు. ఇటువంటి పరిస్థితి ఎవరికీ రావద్దన్న ఆకాంక్షతో  రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.


రేపటి(మంగళవారం) నుంచి మహబూబూబ్‌నగర్‌ జిల్లాలో కేవలం రూ. 1,999 సీటీ స్కానింగ్ తీయాలని ప్రైవేటు ఆస్పత్రులకు, ల్యాబ్‌లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కరోనా నేపధ్యంలో పేద ప్రజలకు అన్ని ప్రైవేటు డయాగ్నోస్టిక్ కేంద్రాల ద్వారా కేవలం రూ. 1,999 సీటీ స్కాన్ చేసేందుకు ప్రైవేటు డయాగ్నోస్టిక్ కేంద్రాల అసోసియేషన్ అంగీకరించిందని తెలిపారు.


కరోనా తీవ్ర ఉధృతిని దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని అన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో రెమిడిసివిర్ ఇంజక్షన్లు అందుబాటులో పెడుతున్నామని పేర్కొన్నారు. ధరల నియంత్రణ విషయమై డీఎంహెచ్‌వో ఆధ్వర్యంలో డ్రగ్ ఇన్స్పెక్టర్, ఆర్డ్డీఓ, డీఎస్పీలతో టాస్క్‌ఫోర్స్ బృందం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రైవేటు ఆస్పత్రులల్లో 20 శాతం బెడ్లను తప్పనిసరిగా పేదలకు కేటాయించాలని, లేనిపక్షంలో ప్రభుత్వమే వాటిని స్వాధీనం చేసుకుంటుందని హెచ్చరించారు.

Updated Date - 2021-05-18T02:00:44+05:30 IST