Advertisement
Advertisement
Abn logo
Advertisement

క్షేత్రస్థాయి అంచనాల్లో తప్పులు

రెవెన్యూ భవనలో నిర్వహించిన జిల్లా అధికారుల సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి బొత్స సత్యనారాయణ..

పంటనష్టంపై కాకిలెక్కలు..!

భారీగా పంటనష్టం వాటిల్లితే తక్కువగా చూపుతున్న వైనం

అధికారుల తప్పిదాలతో రైతులకు అన్యాయం

వ్యవసాయ, ఉద్యాన అధికారుల తీరుపై ఎమ్మెల్యేల మండిపాటు

పప్పుశనగకు పరిహారం ఇవ్వాలని డిమాండ్‌

అనంతపురం వ్యవసాయం, నవంబరు 27: జిల్లాలో భారీ వర్షాలకు వాటిల్లిన పంటనష్టంపై వ్యవసాయ, ఉద్యాన అధికారులు కాకిలెక్కలు చూపుతున్నారని పలువురు ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీగా పంటనష్టం వాటిల్లితే చాలా తక్కువ విస్తీర్ణంలో జరిగినట్లు నివేదికలు తయారు చేశారంటూ మండిపడ్డారు. క్షేత్రస్థాయిలో ఈ-క్రాపింగ్‌ సక్రమంగా చేయకపోవడంతో బాధిత రైతులు నష్టపోవాల్సి వస్తోందని దుయ్యబట్టారు. పంటనష్టం అంచనాల్లో తేడాలతోపాటు జిల్లాలో నెలకొన్న పలు రకాల సమస్యలపైనా అధికార పార్టీ ప్రజాప్రతినిధులే ఇనచార్జి మంత్రి బొత్స సత్యనారాయణ ఎదుట ఏకరువు పెట్టడం గమనార్హం. శనివారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనలో మంత్రి శంకర్‌నారాయణతో కలిసి జిల్లా ఇనచార్జి మంత్రి బొత్స సత్యనారాయణ జిల్లాలో వరదలు, భారీ వర్షాలకు జరిగిన నష్టంపై ప్రజాప్రతినిధులు,  అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. పలువురు ప్రజాప్రతినిధులు పంటనష్టం అంచనాలు, ఈ-క్రాపింగ్‌ తదితర విషయాలపై అడిగిన ప్రశ్నలకు ఆయా శాఖల అధికారులు సరైన సమాధానం చెప్పలేకపోయారు. దీంతో ఆయా సమయాల్లో ఇనచార్జి మంత్రి  జోక్యం చేసుకొని సర్దిచెబుతూ వచ్చారు. జిల్లాలో వరద సహాయ చర్యలు చేయడంలో జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ చూపారని ఇనచార్జి మంత్రి అభినందించారు. అకాల వర్షాలకు నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటామన్నారు. భారీ వర్షాలకు పంటనష్టం అంచనాల్లో తేడాలున్నాయని ప్రజాప్రతినిధులు అభ్యంతరం తెలుపుతున్నారనీ, మరో రెండు రోజుల్లో ప్రజాప్రతినిధులు ఏయే తేడాలున్నాయో జిల్లా యంత్రాంగానికి తెలియజేయాలన్నారు. వచ్చే వారంలో వ్యవసాయ శాఖ కమిషనర్‌ను జిల్లాకు పంపిస్తామనీ, ఆ సమావేశంలో వాస్తవ వివరాలు అందిస్తే రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. పప్పుశనగ రైతులకు సబ్సిడీతో విత్తనాలు ఇవ్వడంతోపాటు పంటనష్టపరిహారం కూడా ఇవ్వాలని తీర్మానం చేశామనీ, ఆ మేరకు ప్రభుత్వానికి  ప్రతిపాదనలు పంపుతామన్నారు. భారీ వర్షాలకు జిల్లాలోని 2153 ఇళ్లు పాక్షికంగా, 159 ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.5వేలు పరిహారం ఇస్తామన్నారు. పూర్తిగా దెబ్బతిన్న వాటికి రూ.95వేలు ఇవ్వడంతోపాటు కొత్త ఇళ్ల మంజూరుకు చర్యలు తీసుకుంటామన్నారు. దెబ్బతిన్న ఇళ్ల వివరాలను పూర్తి స్థాయిలో లెక్కించలేదని కొందరు ప్రజాప్రతినిధులు తమ దృష్టికి తీసుకువచ్చారనీ, రెండు రోజుల్లో పూర్తిస్థాయి నివేదికలు పంపాలని అధికారులను ఆదేశించామ న్నారు. జిల్లాలో 333 చెరువులకు గండ్లు పడ్డాయనీ, వీటిలో 8 చెరువుల్లో పునరుద్ధరణ పనులు చేశారనీ, మిగతా వాటిలో పనులు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో 231 కిలోమీటర్ల మేర రోడ్లు పాక్షికంగా, పూర్తిగా దెబ్బతిన్నట్టు వివరించారు. 47 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడిందన్నారు. ఇప్పటిదాకా 41 ప్రాంతాల్లో పునరుద్ధరణ పనులు పూర్తి చేశారనీ, మిగిలిన ప్రాంతాల్లో శాశ్వత పనుల కోసం ప్రతిపాదనలు పంపాలని ఆదేశిం చారు. పంచాయతీ రాజ్‌ పరిధిలోని 62 ప్రాంతాల్లో రోడ్లు పూర్తిగా తెగిపోయాయని, రూ.200 కోట్లతో పునరుద్ధరణ పనులు చేసేందుకు ప్రతిపాదనలు పెట్టాలన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తాగునీరు, కరెంటు సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.


ప్రజాప్రతినిధుల ఏకరువు ఇలా...

ప్రభుత్వ విప్‌ కాపురామచంద్రారెడ్డి మాట్లాడుతూ వాతావరణ బీమాలో అశాస్ర్తీయ పద్ధతులను సరిచేసి రైతులను ఆదుకోవాలన్నారు. ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజనకు గడువు పొడిగించేలా చూడాలన్నారు. ప్రాజెక్టుల్లోని షట్టర్లు, కాలువలు మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అనంతపురం ఎంపీ రంగయ్య మాట్లాడుతూ జిల్లాలో ప్రత్తి పంట ఎక్కువగా దెబ్బతిన్నా తక్కువ విస్తీరాన్ని నమోదు చేశారన్నారు. కూడేరు మండలం ఇప్పేరు చెరువు పరిధిలోని భూసేకరణకు సంబంధించి రూ.1.5 కోట్లు ఖర్చు చేస్తే స్థానికంగా నెలకొన్న వి వాదాలు తొలగిపోతాయన్నారు. ఉల్లికల్లు, ఉల్లికంటిపల్లిల్లో ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ సమస్యలను పరిష్కరించాలన్నారు. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ మాట్లాడుతూ హిందూపురం పార్లమెంట్‌ పరిధిలో వరద సహాయక చర్యలు చేపట్టడంలో అధికార యంత్రాంగంతోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ తీసుకున్నారన్నారు. పంట, ఆస్తినష్టం జరిగిన బాధితులను ఆదుకోవాలన్నారు. అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ, ఉద్యాన అధికారుల తప్పుడు లెక్కలతో రైతులు నష్టపోతారన్నారు. క్షేత్రస్థాయిలో పంటల సాగు, పంటనష్టం వివరాల్లో తప్పులున్నాయన్నారు. వాటిని సరిచేసి భారీ వర్షాలకు పంటనష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందేలా చూడాలన్నారు. ఈ ఏడాది ఖరీ్‌ఫలో జూన, జూలై ఆఖరు వారాల్లో సాగు చేసిన వేరుశనగ పంట వర్షాభావంతో దిగుబడి రాలేదన్నారు. ఆగస్టులో సాగైన వేరుశగ పంట ఈ నెలలో కోతలు కోశారని, అదే సమయంలో భారీ వర్షాలకు పొలాల్లోనే పంటంతా కుళ్లిపోయిందన్నారు. పశువుల మేతకు కూడా పనికి రాదన్నారు. ఖరీఫ్‌, రబీలో పంటనష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ మాట్లాడుతూ.. ఈ-క్రాపింగ్‌ సక్రమంగా చేయకపోవడంతో పంట నష్టపోయిన రైతులకు అన్యాయం జరిగే అవకాశంఉందన్నారు. రబీలో సాగుచేసిన పప్పుశనగ పంటంతా పూర్తిగా దెబ్బతిందన్నారు. వ్యవసాయ అధికారులు కేవలం సగం శాతం పంట దెబ్బతిన్నట్లు నివేదికలు తయారు చేయడం సరికాదన్నారు. ఈ-క్రాపింగ్‌ పూర్తయిన పంటలకు మాత్రమే పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోందనీ, పప్పుశనగ పంటకు ఇప్పటిదాకా ఈ-క్రాపింగ్‌ చేయలేదన్నారు. పంటనష్టపోయిన రైతులకు 80 శాతం సబ్సిడీతో విత్తనాలు ఇవ్వడంతోపాటు ఇనపుట్‌ సబ్సిడీ అందించేలా చర్య లు తీసుకోవాలన్నారు. ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజనకు ప్రీమియం చెల్లించేందుకు డిసెంబరు 15 వరకే అవకాశం ఉందన్నారు. ఈ-క్రాపింగ్‌ పూర్తయిన రైతులతోనే ప్రీమియం కట్టించుకుంటారన్నారు. జిల్లాలోని రైతులకు ఈ పథకం ద్వారా ప్రీమియం చెల్లించాలన్న విషయాన్ని అధికారులు చెప్పకపోవడం దారుణమన్నారు. గడువు పొడిగిస్తేనే రైతులు బీమా పథకానికి అర్హులవుతారని, లేదంటే అందరూ నష్టపోవాల్సిందేనన్నారు. ఉరవకొండ నియోజకవర్గంలో మిరప పంటకు భారీగా నష్టం వాటిల్లినా, తక్కువ విస్తీర్ణాన్ని ఉద్యాన అధికారులు చూపుతున్నారన్నారు. పంటనష్టం వివరాలు పక్కాగా నమోదుచేసి, బాధిత రైతులకు న్యాయం చేయాలన్నారు. ఎమ్మెల్సీ శివరామిరెడ్డి మాట్లాడుతూ ఉరవకొండ నియోజకవర్గంలో మిరప పంట సాగుచేసినప్పటికీ వేరుశనగ పంటకు ఈ-క్రాపింగ్‌ చేశారన్నారు. ప్రస్తుతం మిరప పంట పూర్తిగా దెబ్బతిందనీ, ఈ-క్రాపింగ్‌లో వేరుశనగ నమోదు చేయడంతో మిరప పంటకు నష్టపరిహారం అందే పరిస్థితి లేదన్నారు. జీడిపల్లి రైతులకు కొన్నేళ్లుగా ముంపు పరిహారం అందించకపోవడంతో ఆందోళన చెం దుతున్నారనీ, అధికారులకు ఇదివరకే విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకా్‌షరెడ్డి మాట్లాడుతూ భారీ వర్షాలకు పప్పుశనగ పంటంతా పోయిందనీ, సబ్సిడీతో విత్తనం ఇచ్చినా అదును సమయం దాటిపోవడంతో విత్తుకునే పరిస్థితి లేదన్నారు. ఎకరాకు రూ.10వేలు పరిహారం అందించి, రైతులను ఆదుకోవాలన్నారు. వర్షాలకు దెబ్బతిన్న చెరువులు, రోడ్ల పునరుద్ధరణ పనులు త్వరగా చేయించాలన్నారు. వాతావరణ బీమాలో లోపాలతో రైతులకు అన్యాయం వాటిల్లుతోందన్నారు. వాటిని సరిచేసి రైతులకు లబ్ధి చేకూ ర్చాలన్నారు. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ ఈ-క్రాపింగ్‌ను ఇళ్ల వద్దనే కూర్చుని చేయడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. ఈ-క్రాపింగ్‌ ఎడిట్‌ ఆప్షన ఇవ్వకపోయినా ఇచ్చినట్లు ఉద్యాన అధికారులు అబద్ధాలు చెబుతున్నారన్నారు. ధర్మవరంలో భారీ వర్షాలకు మగ్గాలు మునిగిపోయి నష్టపోయిన చేనేతలకు ఆర్థికసాయం అందించాలన్నారు. ముదిగుబ్బ, సమీప గ్రామాల్లో భారీ వర్షాలకు పైపులు పగిలిపోవడంతో తాగునీటికి ఇబ్బందిగా ఉందన్నారు. ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నా సరిపోవడం లేదన్నారు. తాగునీటి పైపులైన్లను పునరుద్ధరించడంతోపాటు ఆయా గ్రామాలకు 3 ఫేజ్‌ విద్యుత సరఫరా అయ్యేలా చూడాలన్నారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న బ్రిడ్జి, రోడ్లను వెంటనే పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కోత కోసిన తర్వాత పొలాల్లో తడిసిపోయిన వేరుశనగ పం టకు పరిహారం రాదని వ్యవసాయ అధికారులు చెబుతున్నారన్నారు. అ లాంటి రైతులకు కూడా పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాల ద్వారా మెరుగైన సేవలు అందించాల్సిన వ్యవసాయ, ఉద్యాన అధికారులు ఆ దిశగా పనులు చేయడం లేదన్నారు. పూర్తిస్థాయిలో సర్వే చే యకుండా తూతూ మంత్రంగా పంటనష్టం వివరాలు నమోదు చేశారన్నా రు. లక్ష్ముంపల్లి గ్రామ ప్రజలకు ముంపు పరిహారం అందించి, పునరావా సం కల్పించాలన్నారు. నార్పలలోని కూతలేరు బ్రిడ్జి నిర్మాణం పనులను కాంట్రాక్టర్‌ ఆపేశారని, పెండింగ్‌ బిల్లులు చెల్లిస్తే మిగతా పనులు చేస్తామంటున్నారన్నారు. బ్రిడ్జి నిర్మాణాన్ని వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉల్లికల్లు ప్రజలు భారీ వర్షాలు పడిన ప్రతిసారి ఇబ్బందులు పడుతున్నారని, వారికి తగిన పరిష్కారం చూపాలన్నారు. కదిరి ఎమ్మెల్యే సిద్దారెడ్డి మాట్లాడుతూ కదిరి ప్రాంతంలోనే వరద ప్రభా వంతో ప్రజలు ఎక్కువగా నష్టపోయారన్నారు. మద్దిలేరు వాగుకు ఎక్కువగా నీరొచ్చిన ప్ర తిసారి కదిరిలో ఐదు వార్డుల్లోని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నా రు. వదర ప్రభావం నుంచి ప్రజలను రక్షించేందుకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. కదిరి పట్టణంలోని తాగునీటి సమస్య తీర్చాలన్నారు. కార్యక్రమంలో కలెక్టర్‌ నాగలక్ష్మి, ఎస్పీ ఫక్కీరప్ప,  శాసన మండలి విప్‌ వెన్నపూస గోపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఇక్బాబ్‌, గుంతకల్లు ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి, జడ్పీ చైర్‌పర్సన బోయ గిరిజమ్మ, అహుడా చైర్మన మహాలక్ష్మి శ్రీనివాస్‌, రాష్ట్ర పాఠశాల విద్యా పర్యవేక్షణ కమిషన సీఈఓ ఆలూరు సాంబశివారె డ్డి, ఏడీసీసీ బ్యాంక్‌ చైర్‌పర్సన లిఖిత, అనంత మేయర్‌ వశీం, జేసీలు నిశాంతకుమార్‌, సిరి, నిశాంతి, గంగాధర్‌గౌడ్‌, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.


హాజరైన ప్రజాప్రతినిధులు


సమీక్షా సమావేవంలో వాగ్వాదం చేసుకుంటున్న మాధవ్‌, కేశవ్‌

ఎంపీ గోరంట్ల, ఎమ్మెల్యే పయ్యావుల వాగ్వాదం 

సమీక్షా సమావేశంలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావులకేశవ్‌ మధ్య వాగ్వాదం తలెత్తింది. ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ క్షేత్రస్థాయిలో భారీ వర్షాలకు పంటనష్టం, ఈ-క్రాపిం గ్‌లో లోపాలు, ఇతర అంశాలను జిల్లా ఇనచార్జి మంత్రి బొత్స సత్యనారాయణ దృష్టికి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఎంపీ గోరంట్ల మాధవ్‌ మా ట్లాడుతూ వరద సహాయక చర్యల్లో టీడీపీ నేతలు ఎక్కడా కనిపించ లేదనీ, అయిపోయిన పెళ్లికి పయ్యావు కేశవ్‌ మేలం ఊదేందుకు వచ్చారంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. ఎంపీ వ్యాఖ్యలపై పయ్యావుల కేశవ్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇంతలో ఇనచార్జి మంత్రి జోక్యం చే సుకోవడంతో వివాదం సద్దుమణిగింది.మంత్రి బొత్స సత్యనారాయణ కాన్వాయ్‌ను అడ్డుకుంటున్న ఏఐవైఎఫ్‌, ఏఐఎ్‌సఎఫ్‌ నాయకులను అరెస్ట్‌ చేస్తున్న పోలీసులు

వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం

అనంతపురం క్లాక్‌టవర్‌: జిల్లాలో వరద బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఏఐఎస్‌ఎఫ్‌, ఏఐవైఎఫ్‌ నాయకులు విమర్శించారు. శనివారం జి ల్లా పర్యటనకు వచ్చిన ఇనచార్జి మంత్రి బొత్స సత్యనారాయణ కా న్వాయ్‌ను కలెక్టరేట్‌ సమీపంలో వారు అడ్డుకున్నారు. దీంతో వారిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఏఐఎ్‌సఎఫ్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మనోహర్‌, జి ల్లా ప్రధాన కార్యదర్శి రాజేంద్రయాదవ్‌, ఏఐవైఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి సంతో్‌షకుమార్‌ మాట్లాడుతూ అకాల వర్షాలు, వరదలతో పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50వేలు, ఇల్లు కోల్పోయిన బాధితులకు రూ.5లక్షలు, మృతిచెందిన బాధిత కుటుంబాలకు రూ.25లక్షలు చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. సెంట్రల్‌ యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరిం చి, మౌలిక వసతులు కల్పించాలన్నారు. ఎయిడెడ్‌ పాఠశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రైవేటు, కార్పొరేటు విద్యాసంస్థల అధిక ఫీజులను నియంత్రించాలన్నారు. ముఖ్యమంత్రి జగన తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి బయటకు వచ్చి క్షేత్రస్థాయిలో ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న వరద ప్రభావ సమస్యలను పరిశీలించి సహాయక చర్యలు ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్‌, ఏఐఎ్‌సఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు ఆనంద్‌, చిరంజీవి, నగర కార్యదర్శులు మోహన, రమణయ్య, నాయకులు కుళ్లాయిస్వామి, ఉమామహేష్‌ పాల్గొన్నారు.

కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న సీపీఐ నాయకులు

అనంతను కరువు జిల్లాగా ప్రకటించాలి

ప్రత్యేక నిధులతో వరద బాధితులను ఆదుకోవాలి.. కలెక్టరేట్‌ ఎదుట సీపీఐ ధర్నా, నాయకుల అరెస్ట్‌

అనంతపురం క్లాక్‌టవర్‌, నవంబరు 27: కరవు జి ల్లాగా అనంతపురాన్ని ప్రకటించి ప్రత్యేక నిధులు కేటాయించి, వరద బాధితులను ఆదుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శనివారం కలెక్టరేట్‌ ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఆందోళన చేస్తున్న సీపీఐ నాయకులను కలెక్టరేట్‌ లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో ఉ ద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో పోలీసులు.. సీపీఐ నా యకులను అరెస్ట్‌ చేసి స్టేషనకు తరలించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్‌ మాట్లాడుతూ కదిరిలో వర్షానికి ఇళ్లు కోల్పోయిన బాధితులకు రూ.30లక్షలు పరిహారం, ఆరుగురు మృతికి కారణమైన టీపీఓను వెంటనే స స్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. క్షతగాత్రులకు రూ.2లక్షలు,  నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలన్నారు. జిల్లాలో రైతులకు అన్నిరకాల రుణాలను రద్దు చే యాలన్నారు. ప్రమాదంలో ఉన్న చెరువు లు, కుంటల సమీప ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి, వెంటనే మరమ్మతులు చేపట్టాలన్నారు. వరదలతో నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.30వేలు చొప్పున చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శులు జాఫర్‌, పి నారాయణస్వామి, కార్యదర్శివర్గసభ్యుడు వేమయ్య యాదవ్‌, కార్యవర్గసభ్యుడు కాటమయ్య, నగర కార్యదర్శి శ్రీరాములు, సహాయ కార్యదర్శులు అల్లీపీరా, రమణయ్య, ఏఐఎ్‌సఎఫ్‌, ఏఐవైఎఫ్‌, ఏఐటీయూసీ, రైతుసంఘం నాయకులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement