దోసకాయ బరడా

ABN , First Publish Date - 2020-10-31T18:24:45+05:30 IST

దోసకాయలు - పావుకేజీ, ఉల్లిపాయలు - రెండు, పచ్చిమిర్చి - రెండు, అల్లంవెల్లుల్లి పేస్టు - అర టీస్పూన్‌, పసుపు - పావు టీస్పూన్‌; కారం - ఒక టీస్పూన్‌, ధనియాల పొడి -

దోసకాయ బరడా

కావలసినవి: దోసకాయలు - పావుకేజీ, ఉల్లిపాయలు - రెండు, పచ్చిమిర్చి - రెండు, అల్లంవెల్లుల్లి పేస్టు - అర టీస్పూన్‌, పసుపు - పావు టీస్పూన్‌; కారం - ఒక టీస్పూన్‌, ధనియాల పొడి - ఒక టీస్పూన్‌, సెనగపప్పు - పావు కప్పు, కొత్తిమీర - కొద్దిగా, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా.


తయారీ విధానం: ముందుగా సెనగపప్పును కాస్త వేగించి పొడి చేసి పెట్టుకోవాలి. బాణలిలో నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేగించాలి. తరువాత పసుపు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, ధనియాల పొడి వేసి కలపాలి. ఇప్పుడు కాస్త పెద్దగా తరిగిన దోసకాయ ముక్కలు, తగినంత ఉప్పు వేయాలి. ముక్కలు మగ్గిన తరువాత అరకప్పు నీళ్లు పోసి మూత పెట్టాలి. దోసకాయ ముక్కలు సగం ఉడికిన తరువాత సెనగపప్పు పొడి వేసి కలపాలి. మరోకప్పు నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించాలి. చివరగా కొత్తిమీర వేసి దింపాలి.


దోసకాయ


క్యాలరీలు -  10

ప్రోటీన్లు -  0.6గ్రా

కార్బోహైడ్రేట్లు - 3.6 గ్రా

Updated Date - 2020-10-31T18:24:45+05:30 IST