కీరా దోసె

ABN , First Publish Date - 2020-02-16T16:23:08+05:30 IST

బియ్యం - ఒక కప్పు, పచ్చికొబ్బరి తురుము - ఒక కప్పు, కీరా దోస ముక్కలు - ఒకటిన్నర కప్పులు, జీలకర్ర - ఒక టీ స్పూను, పచ్చిమిర్చి - 3, అల్లం - అంగుళం ముక్క, ఉప్పు - రుచికి సరిపడా.

కీరా దోసె

కావలసిన పదార్థాలు: బియ్యం - ఒక కప్పు, పచ్చికొబ్బరి తురుము - ఒక కప్పు, కీరా దోస ముక్కలు - ఒకటిన్నర కప్పులు, జీలకర్ర - ఒక టీ స్పూను, పచ్చిమిర్చి - 3, అల్లం - అంగుళం ముక్క, ఉప్పు - రుచికి సరిపడా.

తయారు చేసే విధానం: బియ్యాన్ని రెండు, మూడు గంటలు నానబెట్టి నీరంతా వడకట్టి మిక్సీలో వేసి కొంత మెదపాలి. తర్వాత అందులోనే కీరా ముక్కలు, తురిమిన పచ్చికొబ్బరి, చిదిమిన పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ పిండినంతా ఒక పాత్రలోకి తీసుకొని అందులో జీలకర్రతో పాటు రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పదినిమిషాలు పక్కనుంచి తర్వాత పెనంపై నూనె రాసి దోసెలుగా పోసుకుని రెండువైపులా కాల్చుకోవాలి. వీటికి రైతా మంచి కాంబినేషన్‌.

Updated Date - 2020-02-16T16:23:08+05:30 IST