డిమాండ్‌ ఉన్న పంటలనే సాగు చేయాలి

ABN , First Publish Date - 2020-05-30T11:04:00+05:30 IST

రైతులు డిమాండ్‌ ఉన్న పంటల నే సాగు చేయాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి సూచించారు. శుక్రవా రం రెంజల్‌

డిమాండ్‌ ఉన్న పంటలనే సాగు చేయాలి

జిల్లాలో దూపల్లిని రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దుతా : కలెక్టర్‌


రెంజల్‌, మే 29: రైతులు డిమాండ్‌ ఉన్న పంటల నే సాగు చేయాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి సూచించారు. శుక్రవా రం రెంజల్‌ మండలంలోని దూపల్లి గ్రామం లో నిర్వహించిన రైతు వ్యవసాయ అవగాహన స దస్సుకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఐక్యతగా ఉన్నటువంటి గ్రామం దూపల్లి అని, దూపల్లి గ్రామాన్ని రోల్‌ మోడల్‌గా తీర్చి దిద్దుతానని, అందుకు రైతులందరు కలిసి రావాలని ఆయన అన్నారు.


హైదరాబాద్‌ నుంచి వ్యవ సాయ శాస్త్రవేత్తలను రప్పించి గ్రామంలో నాలుగు రోజుల పాటు ఇక్కడి నేలల్లో సన్నరకం ధాన్యం పండించేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎరువులు ఎంత మోతాదులో వాడాలి తదితర విషయాలను క్లుప్తంగా అధ్యయనం చేయిస్తానన్నారు. సన్నరకం మినహా రైతులు ఐడీక్రాపును సా గు చేసే విధంగా అందరు ఒక్కతాటిపై ఉండాలని ఆయన సూచించారు. అవసరం అయితే మరోసారి గ్రామస్థులు తన నిర్ణయంపై చర్చించాలని అనంతరం తనకు తెలిపినట్లు అయితే సన్నరకాలు సాగు చేద్దామని ఆయ న సూచించారు. ధాన్యం సాగుకు రైతుబంధుకు ఎటువంటి సంబంధం లేదని ఆయన సూచించారు.


దేశంలో డిమాండ్‌ ఉన్న పంటలను సాగు చే సినట్లు అయితే ప్రభుత్వం నష్టపోకుండా ఉంటుందని, లేని పక్షంలో డి మాండ్‌ లేని పంటలను సాగు చేస్తే వాటిని ప్రభుత్వమే కొనుగోలు చేయ బడుతుందని, అది ప్రజల డబ్బు కావడంతో అభివృద్ధి వైపు ముందుకు వె ళ్లలేక ప్రభుత్వం ఆర్థికంగా నష్టపోతుందని ఆయన సూచించారు. రాబోవు రోజుల్లో ప్రజలు కొనే ప్రతీ గింజను ఎంతమేరకు రసాయనిక ఎరువులను వాడారని టెస్టులు చేసి మరి తీసుకుంటారని, అంతకు ముందే మన వ్యవ సాయ విధానాన్ని మార్చుకోవాలని ఆయన సూచించారు.


రెండు సంవత్స రాలకు ఒకసారి పంట మార్పిడి జరగాలని, అప్పుడే రైతు అఽధికంగా పంట దిగుబడి వస్తుందని ఆయన సూచించారు. అనంతరం రైతులు మాట్లాడు తూ ధాన్యం కొనుగోళ్లలో రైతులకు వచ్చిన నష్టాన్ని, రైస్‌మిల్‌ యజమా నులు పెట్టిన ఇబ్బందులను కలెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చారు. ధాన్యం కొనుగో ళ్లు జరగడం లేదని కలెక్టర్‌ దృష్టికి రైతులు తీసుకొచ్చారు. సోమవారం వర కు ప్రతీ గింజను కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటానని ఆయ న వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ సాయిరెడ్డి, జడ్పీటీసీ విజయ, పీఏసీఎస్‌ చైర్మన్‌ భూంరెడ్డి, తహసీల్దార్‌ అసదుల్లాఖా న్‌, ఎంపీడీవో గోపాలకృష్ణ, ఏవో, రైతులు తదితరులున్నారు. 

Updated Date - 2020-05-30T11:04:00+05:30 IST