రైతు మేలు కోసమే నియంత్రిత పంటల సాగు

ABN , First Publish Date - 2020-05-30T09:25:52+05:30 IST

రైతుల మేలు కోసమే నియంత్రత పంటలు సాగు అమలు చేస్తున్నట్లు జిల్లా పరిషత్‌ సీఈవో సీహెచ్‌ కృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం వీరవెల్లి

రైతు మేలు కోసమే నియంత్రిత పంటల సాగు

భువనగిరి రూరల్‌/తుర్కపల్లి/భూదాన్‌పోచంపల్లి/చౌటుప్పల్‌ రూరల్‌/ సంస్థాన్‌ నారాయణపురం/ బీబీనగర్‌/రామన్నపేట/ ఆత్మ కూరు(ఎం)/ రాజాపేట/ మోత్కూరు/ అడ్డగూడూరు:  రైతుల మేలు కోసమే నియంత్రత పంటలు సాగు అమలు చేస్తున్నట్లు జిల్లా పరిషత్‌ సీఈవో సీహెచ్‌ కృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం వీరవెల్లి గ్రామంలో జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. రైతుల ఆర్థికాభ్యున్నతి కాంక్షిస్తూ ప్రభుత్వం వానాకాలంలో నియంత్రిత పంటల సాగుకు శ్రీకారం చుట్టిందని అన్నారు. భువనగిరిలో నిర్వహించిన సదస్సులో ఏడీఏ భూక్యా దేవ్‌సింగ్‌, భువనగిరి పీఏసీఎస్‌ చైర్మన్‌ నోముల పరమేశ్వర్‌రెడ్డి రైతులకు అవగాహన కల్పించారు.


తుర్కపల్లి మండలంలోని ఇబ్రహీంపూర్‌, తుర్కపల్లి, మాదాపూర్‌, దత్తాయపల్లి, వాసాలమర్రి వేలుపల్లి తదితర గ్రామాల్లో రైతు సదస్సులు నిర్వహించారు. భూదాన్‌పోచంపల్లి మండలంలోని జలాల్‌పూర్‌, భీమనపల్లి, నారాయణగిరి, జగతిపల్లి తదితర గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించారు. చౌటుప్పల్‌ మండల పరిధిలోని దండు మల్కాపురం, జైకేసారం గ్రామాల్లో నిర్వహించిన సదస్సులో డీఏవో అనురాధ పాల్గొన్నారు. సంస్థాన్‌ నారాయణపురం, జనగాం, గుడిమల్కాపురం, మహ్మదాబాద్‌, కంకణాలగూడెం, గుజ్జ గ్రామాల్లో నిర్వహించిన సదస్సుల్లో ఎంపీపీ గుత్త ఉమాదేవి, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు. బీబీనగర్‌ మండలంలోని నెమురగొముల కొండమడుగు మహదేవ్‌పూర్‌ గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించారు. రామన్నపేట మండలంలోని లక్ష్మాపురం, ఇంద్రపాలనగరం గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించారు.


ఆత్మకూరు(ఎం) మండలంలో రైతు అవగాహన సదస్సులు నిర్వహిం చారు. రాజాపేట మండలంలో రైతులకు అవగాహన కల్పించారు. నియంత్రిత సాగుతోనే రైత్నలు అధిక లాభాలు సాధించవచ్చునని మోటకొండూరు సర్పంచ్‌ వడ్డోబోయిన శ్రీలత అన్నారు. గ్రామంలో రైతులకు అవగాహన కల్పించారు. సమావేశంలో డీసీవో వెంకట్‌రెడ్డి, ఏవో సుబ్బురి సుజాత పాల్గొన్నారు. మోత్కూరు, పనకబండ, దాచారం గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించారు. ఆయిల్‌ఫెడ్‌ రాష్ట్ర చైర్మన్‌ కంచర్ల రామకృష్ణారెడ్డి, ఏవో కె.స్వప్న, మునిసిపల్‌ చైర్మన్‌ తీపిరెడ్డి సావిత్రిమేఘారెడ్డి పాల్గొన్నారు. అడ్డగూడూరు, చౌళ్లరామారం, కోటమర్తి, ధర్మారం, లక్ష్మీదేవికాల్వ గ్రామాల్లో అవగాహన కల్పించారు. 

Updated Date - 2020-05-30T09:25:52+05:30 IST