Abn logo
Sep 23 2021 @ 23:43PM

పొదిలి చెరువులకు చెరుపు

ఎండిపోయిన పెద్ద చెరువు

ఎగువన నీటి ప్రవాహంలో చెక్‌డ్యాంల నిర్మాణం 

దెబ్బతిన్న తూములు, అలుగులు

ఆనవాళ్లు కోల్పోతున్న కాలువలు

పట్టించుకోని పాలకులు

పొదిలి(రూరల్‌) సెప్టెంబరు 23 : నాయకుల స్వార్థం కోసం ఏర్పాటు చేసిన చెక్‌డ్యాంలే రెండు చెరువుల కింద సాగు చేసుకునే రైతులకు నష్టం చేస్తున్నాయి. ఎటువంటి ఆలోచన లేకుండా సంపాదనే ధ్యేయంగా ఇష్టమొచ్చినట్లు చేపట్టిన నిర్మాణాలే ఇప్పుడు ప్రధాన ఆయువుగా ఉన్న ఆ రెండు చెరువులకు చెరుపు చేస్తున్నాయి. ఈ సీజన్‌లో  నీటితో కళకళలాడాల్సిన చెరువులు చుక్క నీరు లేక వెలవెలబోతున్నాయి. తూములు, అలుగులు దెబ్బతిన్నాయి. కాలువలు చిల్లచెట్లతో పూడుకుపోయి ఏకంగా ఆనవాళ్లనే కోల్పోతున్నాయి. దీంతో ఆయకట్టులోని భూ ముల సాగు అటకెక్కింది. అంతే కాకుం డా పొదిలి పట్టణంలోని భూగర్భ జలా లు పాతాళానికి పడిపోయి శీతాకాలం, వేసవికాలం అనే తేడాలేకుండా నీటి సమస్యతో ప్రజలు అల్లాడుతున్నారు. సుమారు 700 నుంచి 800 అడుగులు బోర్లు వేసినా కొన్నిటిలో నీటి చెమ్మకూడా రాని పరిస్థితి తలెత్తుతోంది. 

పొదిలి మండలంలో ప్రధానంగా సాగు నీటి శాఖ పరిధిలో ఐదు చెరువులు ఉన్నాయి. వీటిలో అతి ప్రధానమైనవి పెద్ద చెరువు, చిన్న చెరువు, తీగదుర్తిపాడు వర్ధన చెరువు, దొండ్లేరు చెరవు ఉన్నాయి. పెద్దచెరువు లోతట్టు విస్తీర్ణం 701.32 ఎకరాలు. ఈ చెరువు  కింద 811 ఎకరాలు ఆయకట్టు భూములు ఉన్నాయి. చిన్న చెరువు 101 ఎకరాలు కాగా దీనికింద 238 ఎకరాల ఆయకట్టు భూములు ఉన్నాయి. ఇందులో 70 ఎకరాలు చెరువు గర్భంలో అధికారులు పట్టాలు ఇచ్చారు. చిన్న చెరువు కింద ఆయకట్టు ఎక్కవ భాగం ప్లాట్లుగా మారి ఇష్టారాజ్యంగా నిర్మాణాలు జరిగాయి. సుమారు 150 ఎకరాలకు పైగా సాగు విస్తీర్ణం తగ్గింది. ఆ మిగిలిన విస్తీర్ణం కూడా నాయకుల స్వార్థం కోసం  ఎక్కువ భాగంలో పడిన వర్షపు నీరు పారే కాలువలకు చెక్‌డ్యాంల పేరుతో ఎక్కడికక్కడ కట్టలు నిర్మించడంతో పైన కురిసిన వర్షాలకు వచ్చేనీరు కూడా ఎక్కడికక్కడే నిలిపోయి చెరువులు నిండకుండా పోతున్నాయి. కాలువలు, తూములు, వాగులు చిల్లచెట్లు పెరిగి అడివిని తలపిస్తున్నాయి. ఎక్కవ భాగం ఆక్రమణకు గురై ప్రస్తుతం చెరువు రూపమే కనిపించకుండా పోయింది. వద్దన చెరువు కింద 317 ఎకరాలు, దొండ్లేరు చెరువు  కింద 449 ఎకరాలు, ముసి సప్లై చానల్‌ కింద 1208 ఎకరాలు ఆయకట్టు భూములున్నాయి. పట్టణానికి ఆనుకొని ఉన్న చెరువులు రెం డు ఒక్కసారి నిం డితే చాలు (పునా స, ఎర్రగాడు) రెండు కార్లు పం టలు పండించకోవచ్చని రైతులు చెప్తున్నారు. గతంలో సుమారు వెయ్యి ఎకరాలకు పైగా ఆయకట్టు భూముల్లో పంటలు విరివిగా పండేవి. ఇప్పుడు పంటలు మచ్చుకైనా కనపడటంలేదు. చెరువులు దశాబ్దకాలంగా అభివృద్ధికి నోచుకోకపోగా అక్రమార్కులకు అడ్డాగా మారాయి. వాటిల్లో పూడుకపోయిన పూడికను తీసి తూముల్లో పెరిగిపోయిన చెట్లను శుభ్రం చేసి, కనుమరుగై పోతున్న వాటిని గుర్తించాలి. వాటిని అభివృద్ధి చేసి సాగు భూములకు నీరు అందించాలని ఈ పరిసర ప్రాంత రైతులు కోరుతున్నారు. చెరువులను నిర్లక్ష్యం వదిలేస్తే ఆక్రమార్కుల చెరలో పడి కనుమరుగు కాక తప్పదని రైతులు హెచ్చరిస్తున్నారు. భారీ వర్షాలు పడితేగాని ఈ చెక్‌ డ్యాంలు నిండి చెరువులకు నీరు  చేరే పరిస్థితి లేదు. అలాంటి వర్షాలు లేక సంవత్సరాలు అయ్యాయి.  ఒకవేళ పడి నా  ఒక్కో చెరువుకు పైభాగంలో సుమారు 30 వరకు చెక్‌ డ్యాంలు ఉన్న ట్లు అధికారులు చెప్తున్నారు. పిల్ల కాలువలు కూడా పూడికతో పూడిపో యి ఉన్నాయి. చెరువులకు చుక్కనీరు చేరే అవకాశం లేకుండా పోయింది. దీంతో ప్రత్యక్షంగా ఆయకట్టు పరిధిలో రైతులు, పట్టణంలో 50 వేలకు పైగా ప్రజలు నీటికి పరోక్షంగా ఇబ్బందులు పడుతున్నారు. సుమారు 15 వేలకు పైగా ఉండే గృహాల్లో సుమారు 6 వేల వరకు బోర్లు ఉన్నాయి. వర్షాభావం వల్ల 4 వేలకు పైగా బోర్లు ఎండిపోయాయి. చెరువులకు నీరు చేరే కాలువల్లో ఏర్పాటు చేసిన చెక్‌ డ్యాంలు, తొలగించి కాలువల్లో మట్టి పూడిక తీయించి చెరువులకు వర్షపు నీరు చేరే విధంగా అబివృద్ధి చర్యలు తీసుకుంటే రెం డు చెరువుల కింద ఉన్న ఆయకట్టు 1249 ఎకరాల భూము లు, అంతే కాకుండా పరోక్షంగా ఉన్న వందలాది ఎకరాలు సా గులోకి వస్తాయని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.  చెరువులకు నీరు చేరే పల్లె కం టేరు వాగుకు అధిక ప్రాధా న్యం ఇచ్చి అభివృద్ధి చేస్తే ఎక్క వ ప్రయోజనం ఉంటుందని అలా జరిగితే ఈ ప్రాంతం సస్యశామలం అవుతుందని ఈ ప్రాంత ప్రజల ఆశ. కాని ఈ కోరికను తీర్చే నాయకులు ఈ ప్రాంతంలో ఉన్నారా అనే సందేహం కలుగుతుంది.