సంస్కృతిని సంప్రదాయాలను కాపాడాలి

ABN , First Publish Date - 2021-12-03T04:11:48+05:30 IST

భారతదేశ సనాతన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతి హిందువు పాటిస్తూ దేశ ప్రగతి కోసం ముందుకు సాగాలని ప్రముఖ వేద పండితుడు, ఆధ్యాత్మిక బోధకుడు త్రిదండి దేవనాధరామానుజ జీయర్‌ స్వామి అన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని సింగరేణి పాఠశాల మైదానంలో గురువారం రాత్రి నిర్వహించిన కార్తీకదీప మహో త్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

సంస్కృతిని సంప్రదాయాలను కాపాడాలి
కార్తీక దీపోత్సవంలో పాల్గొన్న మహిళలు

మందమర్రిటౌన్‌, డిసెంబరు 2: భారతదేశ సనాతన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతి హిందువు పాటిస్తూ దేశ ప్రగతి కోసం ముందుకు సాగాలని ప్రముఖ వేద పండితుడు, ఆధ్యాత్మిక బోధకుడు త్రిదండి దేవనాధరామానుజ జీయర్‌ స్వామి అన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని సింగరేణి పాఠశాల మైదానంలో గురువారం రాత్రి నిర్వహించిన కార్తీకదీప మహో త్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా  హాజరయ్యారు. ముందుగా ఆయన ప్రవచనాలను వినిపించారు. కార్తీకమాసంలో దీపారాధన చేసే వారికి అంతా మేలు జరుగుతుందన్నారు. అనంతరం దీపారాధన కార్యక్రమాన్ని దీపాలు వెలిగించి ప్రారంభించారు. జడ్పీ చైర్‌పర్సన్‌ దంపతులు నల్లాల భాగ్యలక్ష్మి ఓదెలు దంపతులు, మందమర్రి ఏరియా జీఎం చింతల శ్రీనివాస్‌ దంపతులు, గుర్తింపు సంఘం ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లిసంపత్‌ దంపతులు దీపాలను వెలి గించారు. అంతకుముందు శ్రీనివాస కల్యాణంతోపాటు మహారుద్రాభిషేకం పూజలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో వేదపండితులు రామానుజచార్యులు, మదిశంకరశర్మ, అనంతా చార్యులు, నర్సింహాచార్యులు, కృష్ణమాచార్యులు, భక్తులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-03T04:11:48+05:30 IST